బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్‌పై భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చేయాల్సినవన్నీ కేంద్రం చేసిందని స్పష్టం చేశారు.
"ఇవన్నీ ఊహాజనితమైన ఆందోళనలు, ఊహాజనిత పరిస్థితులు-మాటలు. మీరు వీటికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. బ్రిటన్‌లో ఏం జరుగుతోందో భారత ప్రభుత్వానికి అవగాహన ఉంది. నన్ను అడిగితే.. ఈ విషయంపై అసలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరమే లేదు."
-- హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్యమంత్రి.
ఇదీ చూడండి:- కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ కథేంటి?
'విమానాలు రద్దు చేయండి'
కొత్త రకం కరోనా స్ట్రెయిన్ వల్ల బ్రిటన్ గడగడలాడుతోంది. అక్కడ వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫలితంగా అనేక దేశాలు బ్రిటన్ విమానాలపై నిషేధం విధించాయి.
ఈ నేపథ్యంలో.. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను కేంద్రం తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేశారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
"బ్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త మ్యుటేషన్ ఆవిర్భవించింది. ఇదొక సూపర్‌స్ప్రెడర్. ఈ నేపథ్యంలో బ్రిటన్ నుంచి విమానాల రాకను కేంద్రం తక్షణమే నిషేధించాలి."
--- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి.
ఇదీ చూడండి:- బ్రిటన్ నుంచి ఇటలీకి పాకిన 'కొత్త రకం' కరోనా