మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు(farm laws repeal) చేసే అధికారిక ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. చట్టాల ఉపసంహరణ బిల్లులకు (Farm laws bill) ఈ బుధవారం జరిగే సమావేశంలోనే మంత్రివర్గం(Union cabinet) ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
ఈనెల 29న ప్రారంభంకానున్న పార్లమెంట్ శీతాకాల(winter session of parliament) సమావేశాల్లోనే ఈ బిల్లులను ప్రవేశపట్టనున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఈనెల 19న గురునానక్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi).. కొత్త సాగు చట్టాలను ఉపసంహరించుకుంటామని (farm laws repealed) సంచలన ప్రకటన చేశారు. చట్టాలపై కొందరిని ఒప్పించటంలో విఫలమయ్యామని, రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
ఇదీ చూడండి: 'యథావిధిగా రైతు నిరసనలు- కొత్త డిమాండ్లతో మోదీకి లేఖ'