యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది. మొత్తం 42 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 12ను ఆఖరి తేదీగా నిర్ణయించింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం..
ముఖ్యమైన తేదీలు
- ప్రారంభతేది: జనవరి23
- చివరితేది: ఫిబ్రవరి12
ఖాళీల వివరాలు
- చీఫ్ మేనేజర్(ఛార్టెడ్ అకౌంటెంట్): 3 పోస్టులు
- సీనియర్ మేనేజర్ (క్రెడిట్ ఆఫీసర్): 34 పోస్టులు
- మేనేజర్ (క్రెడిట్ ఆఫీసర్): 5 పోస్టులు
పే స్కేల్
- చీఫ్ మేనేజర్ (ఛార్టెడ్ అకౌంటెంట్): 76,010
- సీనియర్ మేనేజర్ (క్రెడిట్ ఆఫీసర్): 63,840
- మేనేజర్ (క్రెడిట్ ఆఫీసర్): 48,170
- అర్హత వివరాలు
చీఫ్ మేనేజర్ (చార్టర్డ్ అకౌంటెంట్): ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అసోసియేట్ మెంబర్ (ACA) అయ్యి ఉండాలి. - సీనియర్ మేనేజర్ (క్రెడిట్ ఆఫీసర్): ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు
- ఓబీసీ రూ.850
- SC/ST/PWBD అభ్యర్థులకు రూ.150
ఎంపిక విధానం
- ప్రిలిమినరీ పరీక్ష
- బృంద చర్చ
- వ్యక్తిగత ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం
అర్హత కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు పై పోస్టులకు 2023 ఫిబ్రవరి 12లోగా అధికారిక వెబ్సైట్ అయిన unionbankofindia.co.in. ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.