ETV Bharat / bharat

'ఎన్నికల్లో పోటీ చేయనివ్వకపోతే నిప్పంటించుకుంటా' - గల్సీ అసెంబ్లీ నియోజక వర్గ అభ్యర్థి బగ్దీ

బంగాల్​ ఎన్నికల్లో పోటీ చేయవద్దంటూ సొంత పార్టీ నేతలే ఒత్తిడి చేస్తున్నారని భాజపా అభ్యర్థి తపన్​ బాగ్దీ ఆరోపించారు. తనపై తృణమూల్ ప్రభుత్వం తప్పుడు కేసును బనాయించిందనీ.. ఆ కేసు పెండింగ్​లో ఉన్నందున తనను పోటీ నుంచి తప్పుకోవాలంటున్నారని చెప్పారు . తనను పోటీ చేయనివ్వకపోతే పార్టీ కార్యాలయం ఎదుటే నిప్పంటించుకుంటానని హెచ్చరించారు.

'Under pressure by party' not to contest, Bengal BJP nominee threatens to immolate self
'ఎన్నికల్లో పోటీచేయనివ్వకపోతే.. నిప్పంటించుకుంటా'
author img

By

Published : Mar 28, 2021, 5:30 PM IST

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని పూర్వ బర్దమాన్ జిల్లా భాజపా నేతలు తనపై ఒత్తిడి తెస్తున్నారని భాజపా అభ్యర్థి తపన్​ బాగ్దీ ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎన్నికల్లో పోటీ చేయనివ్వకపోతే భాజపా కార్యాలయం ఎదుటే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తనపై తృణమూల్ ప్రభుత్వం తప్పుడు కేసును బనాయించిందనీ.. ఆ కేసు పెండింగ్​లో ఉన్నందున తనను పోటీ నుంచి తప్పుకోవాలని భాజపా నేతలు ఒత్తిడి తెస్తున్నారన్నారు. హత్య, హత్యాయత్నం కేసులు పెండింగ్​లో ఉన్న ఎంతో మంది నేతలు పోటీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం తనను బంగాల్​లోని గల్సీ(ఎస్సీ) నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించిందన్నారు.

" నేను చాలా కాలం నుంచి అనేక రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. తృణమూల్ ప్రభుత్వం నాపై తప్పుడు కేసు నమోదు చేసింది. ఆ కేసును బలోపేతం చేస్తూ కొన్ని పోస్టర్లు వెలిశాయి. దీంతో కేసుకు సంబంధించిన పత్రాలను సమర్పించమని జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఆదేశం వచ్చింది. నేను వారికి అన్ని పత్రాలను సమర్పించా. అయినా.. నన్ను పోటీ చేయవద్దంటున్నారు."

-- తపన్ బాగ్దీ, భాజపా అభ్యర్థి

1991 నుంచి భాజపాలో పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు తపన్​. 2011లోనూ గల్సీ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగానని గుర్తు చేశారు. తాను సామాజికంగా వెనుకబడ్డానని.. కానీ తనలాంటి ఎంతో మంది మద్దతు ఉందన్నారు. సోమవారం నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపారు.

'తపన్ వ్యాఖ్యలు అవాస్తవం'

తపన్​ వ్యాఖ్యలు అవాస్తవం అని జిల్లా భాజపా అధ్యక్షుడు అభిజిత్​ తా స్పష్టం చేశారు. తపన్​ను కేసుకు సంబంధించిన పత్రాలను పంపించాలని ఆదేశించామని.. వాటిని రాష్ట్ర భాజపా కార్యాలయానికి పంపించామన్నారు. ఎన్నికల్లో పోటీ చేయవద్దని తపన్​ను ఎవరూ ఒత్తిడి చేయలేదన్నారు.

తనను గౌరవించని పార్టీలో ఉండాలా? వద్దా? అని తపన్​ బాగ్దీనే ఆలోచించుకోవాలని పూర్వ బర్ధమాన్​ జిల్లా తృణమూల్ ప్రతినిధి ప్రసేన్​జిత్​ దాస్ సూచించారు.

బంగాల్​లో ఎన్నో ఏళ్లుగా పార్టీకి కృషి చేసినవారిని పక్కన పెట్టి.. కొత్తవారికి అవకాశం ఇస్తున్న క్రమంలో భాజపా కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'భాజపాకు బంగాల్​లో మెజారిటీ- అసోంలో అధికారం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.