ETV Bharat / bharat

పేరెంట్స్​కు గుడ్​న్యూస్- ఇక ప్రభుత్వ బడుల్లో ప్లేస్కూల్స్​!

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో ఐదేళ్లపాటు సమగ్ర శిక్షా పథకాన్ని కొనసాగించాలని తీర్మానించింది. ఇందులో భాగంగా.. ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్లేస్కూల్స్ ఏర్పాటు చేయనుంది.

author img

By

Published : Aug 4, 2021, 4:19 PM IST

Updated : Aug 4, 2021, 5:58 PM IST

playschools in govt schools
ప్రభుత్వ బడుల్లో ప్లేస్కూల్స్​

భారతీయ విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు సిద్ధమైంది కేంద్రప్రభుత్వం. జాతీయ విద్యా విధానం, సమగ్ర శిక్షా 2.0 కింద సరికొత్త కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ మేరకు మరో ఐదేళ్లపాటు సమగ్ర శిక్షా పథకాన్ని కొనసాగించాలని కేంద్ర కేబినెట్​ బుధవారం నిర్ణయించింది. 2021, ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు ఈ పథకం కొనసాగుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​..​ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

"విద్యా మౌలికవసతులను మెరుగుపరుచడం కోసం కేంద్రం రూ.3,00,000 కోట్లు వెచ్చిస్తోంది. విద్యలో సమానత్వం, నాణ్యత, అందరికీ అందుబాటులో ఉండాలని ప్రధానమంత్రి ఆకాంక్షిస్తున్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర శిక్షా 2.0 ​పథకాన్ని తీసుకువచ్చారు. "

-ధర్మేంద్ర ప్రధాన్​, కేంద్ర విద్యాశాఖ మంత్రి

కేంద్రం చేపట్టే కార్యక్రమాలివే..

  • జాతీయ విద్యా విధానం, సమగ్ర శిక్షా 2.0 కింద ప్రభుత్వ పాఠాశాలల్లో ఇకపై ప్లేస్కూల్స్​ ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ఉపాధ్యాయులకు తగిన శిక్షణ అందించనున్నారు.
  • వృత్తివిద్యకు అధిక ప్రాధాన్యమిచ్చేలా విద్యా విధానంలో మార్పులు చేయనున్నారు. 6 నుంచి 8 వ తరగతి దశలోనే విద్యార్థుల ఆసక్తులకు ప్రాధాన్యమిచ్చి 9వ తరగతి నుంచి 12వ తరగతి మధ్య వారికి తగిన నైపుణ్య శిక్షణ అందించనున్నారు.
  • కోడింగ్​, ఆగ్యుమెంటెండ్​ రియాలిటీ, వర్చువల్​ రియాలిటీ వంటి సాంకేతికతలపై విద్యార్థులకు శిక్షణ అందించనున్నారు.
  • సమగ్ర శిక్షా 2.0లో భాగంగా విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించనున్నారు. సెకండరీ స్థాయి విద్యార్థులకు ఏటా రూ.6,000 ఇందుకోసం ఖర్చు చేయనున్నారు.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులైన 16 నుంచి 19 ఏళ్ల వయసు వారికి వారి సెకండరీ విద్యను నేషనల్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఓపెన్ స్కూలింగ్​లో పూర్తి చేసేలా.. ఏడాదికి రూ.2,000 చొప్పున సాయం అందించనున్నారు.

పిల్లల రక్షణ కోసం..

సమగ్ర శిక్షా పథకంలో భాగంగా.. మొదటిసారి పిల్లల సంరక్షణ కోసం కేంద్రం చర్యలు చేపట్టిందని ధర్మేంద్ర ప్రధాన్​ తెలిపారు. పిల్లల హక్కుల సంరక్షణ కోసం ఓ కమిషన్​ ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలకు సాయం అందించనున్నట్లు చెప్పారు.

సమగ్ర శిక్షా 2.0 పథకం అమలు చేసేందుకు రూ.2,94,283 కోట్లు అవసరం కానున్నాయి. అందులో కేంద్రం వాటా రూ.1,85,398.32 కోట్లు. ఈ పథకం.. పదిలక్షలకుపైగా పాఠశాలలు, 15.6 కోట్లకుపైగా విద్యార్థులు, ప్రభుత్వ, ఎయిడెడ్​ పాఠశాలలకు చెందిన 57లక్షల మంది ఉపాధ్యాయులకు వర్తిస్తుందని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

పిల్లలపై నేరాల విచారణ కోసం..

మరోవైపు... 389 పోక్సో న్యాయస్థానాలు సహా 1,023 ఫాస్ట్​ట్రాక్​ ప్రత్యేక కోర్టులను కేంద్రం సాయంతో మరో రెండేళ్లపాటు నిర్వహించడానికి కేంద్ర కేబినెట్ బుధవారం​ ఆమోదం తెలిపింది. ఈ పథకం ఇప్పటికే.. 28 రాష్ట్రాల్లో అమలవుతోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్​ తెలిపారు. బంగాల్​లో ఈ పథకాన్ని ఇంకా ప్రారంభించలేదన్న ఆయన.. త్వరలోనే ఆ రాష్ట్రంలోనూ దీన్ని ప్రారంభిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. 'నిర్భయ' నిధి కింద ఈ పథకానికి కేంద్రం తరఫున నిధులు అందిస్తామని చెప్పారు.

Last Updated : Aug 4, 2021, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.