ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో నిలిపివేసిన కారు యజమాని మాన్సుఖ్ హిరెన్ మృతిచెందిన ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు శివసేన నేత సంజయ్ రౌత్. ఆయన మృతి వెనుక దాగి ఉన్న వాస్తవాలను వెలికితీయటం ఎంతో ముఖ్యం అన్నారు. ఇది మహారాష్ట్ర వికాస్ అఘాడీ(ఎంవీఏ)ప్రభుత్వ గౌరవం, ప్రతిష్ఠకు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. ఈ ఘటనతో తాను షాక్కు గురైయ్యానని తెలిపారు. మాన్సుఖ్ మృతిని రాజకీయం చేయటం తగదనని విపక్షాలను హెచ్చరించార రౌత్. మాన్సుఖ్ది ఆత్మహత్యా? లేక హత్యా? తేలాల్సిఉందని.. ఈ కేసును హోం శాఖ త్వరగా ఛేదించాలని సూచించారు.
ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో జిలెటిన్ స్టిక్స్తో పార్క్ చేసిన కారు యజమాని మాన్సుఖ్ హిరెన్.. ఠాణెలో శుక్రవారం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. 45 ఏళ్ల మాన్సుఖ్ ఆచూకీ గురువారం రాత్రి నుంచి గల్లంతవడం గమనార్హం. ఈ విషయంపై శుక్రవారం మధ్యాహ్నం అతని కుటుంబ సభ్యులు నౌపాడా ఠాణాలో ఫిర్యాదు చేశారు. గాలింపు చేపట్టగా ముంబ్రా రేతి బుందర్ రోడ్డు వద్ద ఓ కాలువ పక్కన అతని మృతదేహం లభ్యమైంది.
ఇదీ చదవండి : అంబానీ ఇంటి ముందు దొరికిన కారు యజమాని మృతి
ఇదీ చదవండి : ముకేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల కలకలం