మధ్యప్రదేశ్, ఇండోర్‌లో విషాదం జరిగింది. ఆన్లైన్ గేమ్స్‌కు బానిసైన ఓ యువకుడు వాటికోసం చేసిన అప్పులు కట్టలేక తనువు చాలించాడు. ఇండోర్‌లోని ఇంద్రపురి హాస్టల్లో ఉండే జితేంద్ర వసాకల్(25) గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు భవర్ఖాన్ పోలీసులు తెలిపారు. జితేంద్ర జేబులో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
కొన్ని ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకు అప్పులు చేశానని.. అవి కట్టలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొన్నాడని అన్నారు ఏఎస్సై రామ్‌ప్రసాద్. అయితే ఎంత అప్పు చేశాడో మాత్రం లేఖలో చెప్పలేదని వివరించారు.
మృతుడి స్వస్థలం మహారాష్ట్ర కాగా.. ప్రస్తుతం కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పోస్ట్ గ్యాడ్యూయేట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాక సెక్యూరిటీ గార్డ్‌గానూ పనిచేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: రేప్‌ను ప్రతిఘటించిందని బాధితురాలి హత్య.. శవంపైనే అత్యాచారం