ETV Bharat / bharat

గుజరాత్​లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం.. మహారాష్ట్ర, కేరళలోనూ.. ​ - మహారాష్ట్రలో ఎక్స్​బీబీ కేసు

భారత్​లో కొవిడ్ కేసులు తగ్గుతున్నాయని భావిస్తున్న నేపథ్యంలో.. కొత్త వేరియంట్​లు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గుజరాత్​లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 తొలి కేసు నమోదైంది. మరోవైపు, మహారాష్ట్రలో గతవారంలో నమోదైన కరోనా కేసుల్లో 17.7శాతం పెరుగుదల కనిపించింది. వీటిలో ఎక్కువగా ఒమిక్రాన్‌ ఉపరకమైన ఎక్స్‌బీబీ ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.

omicron bf 7 in india
ఒమిక్రాన్ న్యూ వేరియంట్
author img

By

Published : Oct 20, 2022, 10:28 AM IST

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి అదుపులో ఉందని భావిస్తోన్న వేళ.. గుజరాత్​లో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. బీఎఫ్.7 అనే వేరియంట్ కేసు గుజరాత్​లోని అహ్మదాబాద్​లో నమోదైంది. ఈ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి అధికమని వైద్యులు తెలిపారు. 60 ఏళ్ల వృద్ధుడికి ఈ ఇన్‌ఫెక్షన్ సోకిందని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జులై 15.. రోగి శాంపిల్స్​ను గాంధీనగర్​లోని బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్​కు పంపగా.. అక్టోబరు 17న నివేదిక వచ్చింది. అందులో రోగికి ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్.7 సోకినట్లు నిర్ధరణ అయ్యిందని అధికారులు తెలిపారు. అతడితో సన్నిహితంగా ఉన్న 10 మందికి ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవని పేర్కొన్నారు.

దేశంలో పలు ప్రాంతాల్లో కొత్త వేరియంట్‌ కేసులు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సమావేశం నిర్వహించారు. నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌, ఎంటాగీ ఛైర్మన్‌ ఎన్‌కే అరోఢా, వ్యాక్సిన్‌ గ్రూప్‌ సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు. దేశంలో కొవిడ్‌ వ్యాప్తి తీరుపై చర్చించిన నిపుణులు.. దేశవ్యాప్తంగా మాస్కులు, కరోనా నిబంధనలు పాటించడాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మహారాష్ట్రలో గతవారంలో నమోదైన కరోనా కేసుల్లో 17.7శాతం పెరుగుదల కనిపించింది. వీటిలో ఎక్కువగా ఒమిక్రాన్‌ ఉపరకమైన ఎక్స్‌బీబీ ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఇప్పటికే వ్యాప్తిలో ఉన్న బీఏ.2.75తో పోలిస్తే విస్తృత వేగంతో వ్యాప్తి చెందడంతోపాటు రోగనిరోధకతను తప్పించుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఫ్లూ మాదిరి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని.. వెంటనే కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. మరోవైపు.. కేరళలో పలు చోట్ల ఈ వేరియంట్‌ కేసులు ఎక్కువగా నమోదవుతుండడం వల్ల అక్కడి ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వైరస్‌లో మార్పులతో కొత్త రకాలు పుట్టుకొస్తున్నందున.. వైరస్‌ కట్టడి చర్యలు ముమ్మరం చేయాలని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ అధికారులను ఆదేశించారు.

బీఏ.2.75, బీజే.1 రకాలు కలిసి ఎక్స్​బీబీ సబ్‌ వేరియంట్‌గా ఏర్పడినట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. దీనిని ఇప్పటికే మహారాష్ట్ర, బంగాల్‌, ఒడిశా, తమిళనాడులో గుర్తించారు. సింగపూర్, యూఎస్‌లలో కరోనా కేసుల పెరుగుదలకు ఈ రకమే కారణమని అంచనా వేస్తున్నారు. దీనికి బీఏ.2.75 కంటే వేగంగా వ్యాప్తి చెందే లక్షణం, రోగనిరోధక శక్తిని ఏమార్చే గుణం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎక్స్​బీబీతో పాటుగా మొదటిసారి మహారాష్ట్రలో బీఏ.2.3.20, బీక్యూ.1 రకాలనూ గుర్తించారు. ఇవి భారత్‌లో మరో కొత్త వేవ్‌కు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Corona Cases in India: దేశంలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 2,141 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. మహమ్మారి వల్ల 20 మంది చనిపోయారు. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.06 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు : 4,46,36,517
  • మరణాల సంఖ్య : 5,28,943
  • యాక్టివ్ కేసులు: 25,510
  • మొత్తం రికవరీలు : 4,40,82,064
  • మొత్తం పంపిణీ చేసిన టీకాలు : 219.46 కోట్లు

ఇవీ చదవండి: 'భాజపాతో టచ్​లో నీతీశ్.. మళ్లీ చేతులు కలపడం పక్కా'.. పీకే జోస్యం

కాజూ కలశ్‌ మిఠాయి.. కేజీ రూ.20వేలు.. స్పెషల్ ఏంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.