Indians in Ukraine: ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపులో భాగంగా రొమేనియా రాజధాని బుచారెస్ట్ నుంచి 200 మంది భారతీయులతో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విమానం.. హిండోన్ ఎయిర్ బేస్‌లో దిగింది. సీ-17 మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ తొలి విమానం.. గురువారం తెల్లవారుజామున 1.30లకు దిల్లీలో ల్యాండ్ అయింది. ఉక్రెయిన్‌లోని భారత పౌరులను తరలించేందుకు చేపట్టిన ఆపరేషన్ గంగలో భాగంగా మరో మూడు సీ-17 విమానాల్లో దాదాపు 300 మంది భారత్‌కు చేరుకోనున్నారు. ఆ విమానాలు ఉదయం 8 గంటలకు హిండోన్ ఎయిర్‌బేస్‌లో దిగనున్నట్లు సమాచారం.
-
#WATCH | The C-17 Indian Air Force aircraft arriving from Bucharest in Romania, carrying around 200 Indian nationals from #Ukraine, lands at its home base in Hindan near Delhi
— ANI (@ANI) March 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
MoS Defence Ajay Bhatt interacted with the citizens after their arrival in Delhi.#OperationGanga pic.twitter.com/uWzo78cMAo
">#WATCH | The C-17 Indian Air Force aircraft arriving from Bucharest in Romania, carrying around 200 Indian nationals from #Ukraine, lands at its home base in Hindan near Delhi
— ANI (@ANI) March 2, 2022
MoS Defence Ajay Bhatt interacted with the citizens after their arrival in Delhi.#OperationGanga pic.twitter.com/uWzo78cMAo#WATCH | The C-17 Indian Air Force aircraft arriving from Bucharest in Romania, carrying around 200 Indian nationals from #Ukraine, lands at its home base in Hindan near Delhi
— ANI (@ANI) March 2, 2022
MoS Defence Ajay Bhatt interacted with the citizens after their arrival in Delhi.#OperationGanga pic.twitter.com/uWzo78cMAo
రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ఎయిర్‌బేస్ వద్ద తొలి సీ-17 విమానంలో తరలి వచ్చిన భారతీయులకు స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌లో దాదాపు 8,000 మంది భారతీయులు, ప్రధానంగా విద్యార్థులు చిక్కుకుపోయారని విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా మంగళవారం తెలిపారు. వారిని తరలించేందుకు నలుగులు కేంద్ర మంత్రులు ఉక్రెయిన్ పొరుగు దేశాలకు వెళ్లారు. హంగేరీలో హర్దీప్సింగ్ పూరి, రొమేనియాలో జ్యోతిరాదిత్య సింధియా, స్లోవేకియాలో కిరణ్ రిజిజు, పోలాండ్‌లో వీకే సింగ్ ఉన్నారు.
రష్యా సైనిక దాడి కారణంగా ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ గగనతలం మూసివేసింది. దీంతో ఉక్రెయిన్ పశ్చిమాన ఉన్న రొమేనియా, హంగేరి, పోలాండ్ దేశాల నుంచి భారత్ ప్రత్యేక విమానాల ద్వారా తన పౌరులను తరలిస్తోంది. ఈ పొరుగు దేశాల నుంచే సీ-17 విమానాలు వస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: రెండోసారి పుతిన్‌తో మోదీ ఫోన్ సంభాషణ