ETV Bharat / bharat

UKG Student Died Beaten by Teacher in Ramanthapur : యూకేజీ విద్యార్థిని పలకతో కొట్టిన టీచర్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి - Hyderabad Latest crime News

UKG Student Died
Ramanthapur
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 4:52 PM IST

Updated : Oct 2, 2023, 7:58 PM IST

16:45 October 02

హోం వర్క్‌ చేయలేదని యూకేజీ విద్యార్థిని పలకతో కొట్టిన టీచర్‌

UKG Student Died Beaten by Teacher in Ramanthapur : . విద్యార్థుల భవిష్యత్​కు బంగారు బాటలు వేయాల్సిన వారు ఉపాధ్యాయులు. ఇందుకోసం వారికి ఎంతో సహనం, ఓర్పు ఉండాలి. కానీ కొందరు టీచర్లు.. కొన్నిచోట్ల వారు ప్రవర్తిస్తున్న తీరు.. వారి వృత్తికే కళకం తెచ్చే విధంగా మారింది. హూం వర్క్ చేయలేదని ఓ టీచర్​.. విద్యార్థి తలపై పలకతో కొట్టింది. దీంతో సదరు బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందతూ మరణించాడు. ఈ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

ఉప్పల్ పోలీస్​స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రామంతపూర్ ( Ramanthapur) వివేక్ నగర్​లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో యూకేజీ చదువుతున్న విద్యార్థి హేమంత్ మృతి చెందాడు. శనివారం హోం వర్క్ చేయలేదని టీచర్.. బాలుడి తలపై పలకతో కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే పాఠశాల యాజమాన్యం హేమంత్​ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం హేమంత్ మృతి చెందాడు.

Boy Dies Trying to Imitate YouTube Video : యూట్యూబ్‌ దృశ్యాలను అనుకరించబోయి.. ఆరో తరగతి విద్యార్థి మృతి

UKG Student Hemanth Died in Ramanthapur : దీంతో ఈరోజు హేమంత్ ( Hemanth)​ మృతదేహంతో‌.. పాఠశాల ముందు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన యాజమాన్యం న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం వారు వనపర్తికి తరలించారు. గత కొంత కాలంగా హేమంత్​ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.

Teacher Beats Students Karimnagar : 'మీరు పుట్టి వేస్ట్​ రా' అంటూ.. విద్యార్థులను చితకబాదిన టీచర్

Teacher Beats Students in Secunderabad : ఇటీవలే తన నిద్రకు భంగం కలిగించాడని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. విద్యార్థిని స్కేల్​తో చితక బాదాడు. ఈ ఘటన సికింద్రాబాద్ ( Secunderabad)​ కార్ఖానా పోలీస్​స్టేషన్ పరిధిలో జరిగింది. ఆశీష్ కుమార్ అనే విద్యార్థి.. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో.. విద్యార్థులు లేకపోవడంతో అదే స్కూల్​లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు రవి కుమార్​ తరగతి గదిలో నిద్రిస్తున్నాడు. పాఠశాల విరామం సమయం ముగియడంతో.. విద్యార్థులు ఒక్క సారిగా పెద్ద శబ్ధం చేస్తూ తరగతి గదిలోకి వచ్చారు.

దీంతో రవి కుమార్​ తనకు నిద్ర భంగమైందని భావించాడు. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహంతో అక్కడున్న విద్యార్థులను స్కేల్​తో చితక బాదాడు. తన టేబుల్​ పక్కనే ఉన్న ఆశీష్​ కుమార్​ పిక్కలు, మోకాలి కింది భాగంలో గట్టిగా కొట్టాడు. ఆశీష్​ కుమార్​ వాళ్ల అమ్మ స్నానం చేయించే క్రమంలో.. బాలుడి శరీరంపై నల్లగా కమిలినట్లు ఉండే గాయాలను గుర్తించింది. ఏం జరిగిందని విద్యార్థిని ఆరా తీయగా జరిగిన విషయం తల్లికి చెప్పాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి.. ఉపాధ్యాయడు రవి కుమార్​ను నిలదీయగా.. తాను కొట్టలేదని బుకాయించాడు.

పాఠాలు చెప్పాల్సిన గురువే పాడు పని చేశాడు.. బాలిక గర్భం దాల్చడంతో..!

మిగతా విద్యార్థులు సైతం.. తమను కొట్టిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు.. రవి కుమార్​పై కార్ఖానా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు సరైనా విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు.. వారే ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని పిల్లల తల్లిందడ్రులు వాపోతున్నారు. ఈ ఘటనపై సంబంధించి పై అధికారులు స్పందించి.. మరోసారి ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చూడలని కోరుతున్నారు.

Student Suspicious Death: గిరిజన వసతి గృహంలో దారుణం.. నాలుగో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి

Bachupally Road accident : చిన్నారిని చిదిమేసిన స్కూల్‌ బస్సు.. డ్రైవర్‌ నిర్లక్ష్యం, గుంతల రోడ్డుతో చిట్టి తల్లి ప్రాణాలు బలి

Last Updated : Oct 2, 2023, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.