ETV Bharat / bharat

మహమ్మారులపై పోరుకు 'వ్యాక్సిన్ హబ్' - వ్యాక్సిన్ హబ్ మోదీ బ్రిటన్

భారత పర్యటనలో ఉన్న బ్రిటన్ విదేశాంగ మంత్రి డోమినిక్ రాబ్​తో ప్రధాని మోదీ బుధవారం భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, కరోనా పోరులో సహకారంపై చర్చించారు. వ్యాక్సిన్ హబ్ ద్వారా నాణ్యమైన క్లినికల్ పరీక్షలను చేపట్టడం వంటి అంశాలపై సమాలోచనలు జరిపారు.

uk india vaccine hub
మహమ్మారులపై పోరుకు 'వ్యాక్సిన్ హబ్'
author img

By

Published : Dec 17, 2020, 4:47 AM IST

భారత్​లో పర్యటిస్తున్న బ్రిటన్ విదేశాంగ మంత్రి డోమినిక్ రాబ్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. బ్రెగ్జిట్ అనంతర భారత్-బ్రిటన్ సంబంధాలు.. కరోనా వైరస్​పై పోరాటంలో సహకారం.. 'వ్యాక్సిన్ హబ్' ద్వారా నాణ్యమైన క్లినికల్ పరీక్షలను చేపట్టడం వంటి కీలక అంశాలపై వారిద్దరూ చర్చించారు. ఉభయ దేశాల వాణిజ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా పదేళ్ల మార్గ సూచీ రూపకల్పనపైనా అభిప్రాయాలు పంచుకున్నారు.

ఇటీవల బ్రిటన్ ఆతిథ్యమిచ్చిన వాతావరణ సదస్సుకు హాజరైనందుకు ప్రధాని జాన్సన్ తరఫున మోదీకి రాబ్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఈ విషయమై ప్రధాని ట్వీట్ చేశారు.

"డొమినిక్ రాబ్​తో సమావేశం చాలా అద్భుతంగా సాగింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన అనంతరం, కొవిడ్ తర్వాత ఉభయ దేశాల సంబంధాలపై విస్తృతంగా చర్చించాం. గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని మోదీ పేర్కొన్నారు.

కొవిడ్ అనంతర ప్రపంచంలో భారత్ బ్రిటన్ సంబంధాలు ఎంతో కీలకం కానున్నాయని మోదీ ప్రస్తావించినట్టు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పెట్టుబడులు వాణిజ్యం, రక్షణ, భద్రత, వలసలు, విద్య ఇంధనం, వాతావరణ మార్పులు, ఆరోగ్యం వంటి అంశాల్లో పూర్తిస్థాయి భాగస్వామ్యంతో ముందుకెళ్లేలా 360 డిగ్రీల మార్గసూచీని రూపొందించుకోవాలని నేతలిద్దరూ భావించినట్టు తెలిపింది.

సంకోభానికి ముగింపు...

వ్యాక్సిన్ల విషయంలో అత్యుత్తమ క్లినికల్ పరీక్ష విధానాలను పంచుకోవడానికి, పరిశోధనలను ముమ్మరం చేయడానికి ఉమ్మడి వేదికగా 'వ్యాక్సిన్ హబ్​'ను ఉభయ దేశాలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు బ్రిటన్ వర్గాలు తెలిపాయి. ఈ హబ్ ద్వారా భారత్- బ్రిటన్ పరిశోధకులు కలిసికట్టుగా కరోనా తదితర ప్రాణాంతక వైరస్​లకు టీకాలను అందుబాటులోకి తీసుకొస్తారని రాబ్​ తెలిపారు.

అత్యుత్తమ సంబంధాలకు ప్రతీక...

ఆక్స్​ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా అందుబాటులోకి రానున్న ఓ ఆసుపత్రిని రాబ్ సందర్శించారు. ఈ వ్యాక్సిన్​ను పుణెలోని సీరం ఇన్​స్టిట్యూట్ అభివృద్ధి చేస్తుండటం పట్ల స్పందించారు. "భారత్- బ్రిటన్ సంబంధాలు అత్యుత్తమంగా ఉన్నాయనేందుకు ఆక్స్​ఫర్డ్ -ఆస్ట్రాజెనెకా టీకాను సీరం ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేస్తుండటమే నిదర్శనం. బ్రిటన్ రూపొందించిన టీకాను భారత్ తయారు చేస్తోంది. ప్రపంచ మానవాళికి మేలు చేసేందుకు, వారిని కాపాడేందుకు ఉభయ దేశాల అత్యుత్తమ ప్రతిభావంతులు కలిసి పనిచేస్తున్నారు" అని రాబ్ వ్యాఖ్యానించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖియాల్​తోనూ రాబ్ భేటీ అయ్యారు.

నిరుపేదలకు మన వ్యాక్సినే...

సీరం ఇన్​స్టిట్యూట్ తయారుచేస్తున్న కొవిడ్ టీకాను ప్రపంచ ఆరోగ్య సంస్థ, వ్యాక్సిన్ అలయెన్స్ గవితో కలిసి... 'కొవాక్స్' కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిరుపేదలకు అందిస్తామని బ్రిటన్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రపంచానికి అవసరమయ్యే వ్యాక్సిన్లలో సగానికిపైగా భారత్ నుంచే సరఫరా అవుతున్నాయని గుర్తుచేశాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.