ETV Bharat / bharat

భారత్, బ్రిటన్​ యుద్ధ విన్యాసాలు- టార్గెట్ చైనా!

author img

By

Published : Jul 16, 2021, 4:38 PM IST

హిందూ మహాసముద్రంలో.. భారత నావికాదళంతో యుద్ధ విన్యాసాలు జరపనుంది బ్రిటన్. జులై 26న జరిగే ఈ కార్యక్రమం కోసం బ్రిటన్​ యుద్ధ నౌక హెచ్​ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్​ ఇప్పటికే హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించింది.

UK, India
భారత నావికాదళం, యూకే

భారత నావికాదళంతో కలిసి భారీ స్థాయిలో యుద్ధ విన్యాసాలు జరపనుంది బ్రిటన్. ఇందుకోసం బ్రిటన్​కు చెందిన హెచ్​ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్ యుద్ధ నౌక హిందూమహాసముద్రంలోకి ప్రవేశించింది. బ్రిటన్​ ఎయిర్​క్రాఫ్ట్​ క్యారియర్ 40 దేశాల పర్యటనలో భాగంగా.. భారత్, బ్రిటన్ సంయుక్తంగా ఈ యుద్ధ విన్యాసాలు చేపట్టనున్నాయి.

ఈ విన్యాసాలతో.. భారత్​, బ్రిటన్​ మధ్య రక్షణ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని బ్రిటన్ విదేశాంగ ప్రతినిధి డొమినిక్ రాబ్ తెలిపారు. తమ యుద్ధ నౌక పర్యటనలో భాగంగా 40 దేశాలతోనూ సత్సంబంధాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాపార కార్యకాలాపాలు వృద్ధి చెందనున్నాయని అన్నారు. సముద్ర మార్గంలో ఏర్పడే విపత్తులను సంయుక్తంగా ఎదుర్కోవచ్చని తెలిపారు.

జులై 26న..

జులై 26న బ్రిటన్​ యుద్ధ నౌకతో విన్యాసాలు జరిపే అవకాశముందని భారత నావికాదళ అధికారులు పేర్కొన్నారు.

హెచ్​ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్..

ఈ యుద్ధ నౌకలో ఎఫ్35బీ ఫైటర్​ జెట్​లు ఉంటాయి. వీటితో పాటు ఆరు రాయల్ నేవీ షిప్స్, ఓ జలాంతర్గామి, 14 నేవీ హెలికాప్టర్లు ఉంటాయి.

ఇదీ చదవండి:చైనాకు చెక్​ పెట్టేలా.. భారత్​, అమెరికా యుద్ధ విన్యాసాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.