ETV Bharat / bharat

శోభకృత్ నామ సంవత్సరంలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే? - ఉగాది పంచాంగం చెప్పాలి

శోభకృత్ నామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

UGADI PANchangam 2023 UGADI HOROSCOPE TELUGU

author img

By

Published : Mar 22, 2023, 7:09 AM IST

శోభకృత్ నామ సంవత్సరంలో 12 రాశుల వారి సంవత్సర ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

.

ఆదాయం 5; వ్యయం 5
రాజపూజ్యం 3; అవమానం 1
ఈ రాశివారికి ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయి. మంచి పనులకై ధనాన్ని వెచ్చిస్తారు. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైన పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. అదృష్టయోగం 50శాతం బాగుంది. ఏకాదశంలో శని విశేషమైన శుభాన్నిస్తున్నాడు. విద్యార్థులు శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో కోరుకున్న స్థాయికి చేరుకుంటారు. వ్యాపారరీత్యా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మొహమాటం వల్ల రుణసమస్యలు రాకుండా చూసుకోవాలి. విదేశ ప్రయాణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఏప్రిల్‌ 22 నుంచి గురువు జన్మరాశిలో సంచరిస్తున్నందున ఇబ్బందికర పరిస్థితులుంటాయి. రోజూ గురుశ్లోకం చదువుకోవాలి. శని ఏకాదశంలో సంపూర్ణ విజయాన్ని ప్రసాదిస్తున్నందువల్ల అదృష్టవంతులు అవుతారు. భూ గృహ యోగాలుంటాయి. రాహువు అక్టోబరు 31 వరకు జన్మరాశిలో, నవంబరు నుంచి ద్వాదశంలో ఇబ్బంది కలిగిస్తాడు. అభిప్రాయభేదాలు రాకుండా జాగ్రత్తపడాలి. రాహుశ్లోకం చదువుకోవాలి. కేతువు వల్ల అక్టోబరు 31 వరకు సప్తమంలో శ్రమ ఉంటుంది. కేతుశ్లోకం చదువుకోవాలి. నవంబరు నుంచి కేతువు షష్ఠస్థానంలో ఉండటం వల్ల శీఘ్ర కార్యసిద్ధి లభిస్తుంది. దైవబలం ప్రశాంతతనిస్తుంది.

.

ఆదాయం 14; వ్యయం 11; రాజపూజ్యం 6; అవమానం 1
విశేషమైన ఆదాయం ఉంది. పెట్టుబడి ప్రయత్నాలు సఫలమవుతాయి. అదృష్టయోగం 75శాతం బాగుంది. చేపట్టే పనుల్లో విజయం లభిస్తుంది. విద్యార్థులకు విశేషమైన విద్యాయోగం, ఉద్యోగులకు అధికార లాభం ఉంటాయి. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. విదేశాల్లో అవకాశాలు పెరుగుతాయి. భూగృహవాహన యోగాలున్నాయి. విఘ్నాలు తొలగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఏప్రిల్‌ నెల 22 తర్వాత ద్వాదశంలో గురు సంచరించే అవకాశం ఉంది. అందువల్ల ఆర్థిక నష్టాలు రాకుండా గురు శ్లోకం చదువుకోవాలి. శని దశమంలో ఉద్యోగపరమైన ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది. రాహువు ద్వాదశంలో శ్రమ కలిగించినా నవంబరు నుంచి శుభయోగాలుంటాయి. కేతువు అక్టోబరు వరకు అనుకూల ఫలితాలనిస్తారు. నవంబర్ తర్వాత సమస్యలు రాకుండా కేతు శ్లోకం పఠించాలి.

.

ఆదాయం 2; వ్యయం 11; రాజపూజ్యం 2; అవమానం 4
ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కష్టపడి పనిచేయాలి. అదృష్టయోగం 50శాతం బాగుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగంలో అధికార యోగం ఉంది. వ్యాపారంలో ఎదుగుతారు. గృహ భూవాహన యోగాలు సిద్ధిస్తాయి. విదేశాల్లో అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఏప్రిల్‌ 22వరకు మిశ్రమ ఫలితాలుంటాయి. గురుశ్లోకం చదువుకోవాలి. ఏప్రిల్‌ 23 నుంచి అదృష్ట యోగం ఉంటుంది. శని భాగ్య స్థానంలో ఉండటం వల్ల శ్రమ ఎక్కువైనా శుభఫలితాలు ఉంటాయి. లోతుగా ఆలోచించవద్దు. రాహువు అక్టోబరు 31వరకు ఏకాదశ స్థానంలో సంపూర్ణ శుభయోగాన్నిస్తున్నాడు. నవంబరు 1 నుంచి రాహువు దశమంలో కార్యసిద్ధి కలిగిస్తాడు. గుర్తింపు లభిస్తుంది. కేతు సంచారంవల్ల మానసిక సమస్యలు రాకుండా కేతు శ్లోకం చదువుకోవాలి.

.

ఆదాయం 11; వ్యయం 8; రాజపూజ్యం 5; అవమానం 4
బ్రహ్మాండమైన ఆర్థికస్థితి గోచరిస్తోంది. అదృష్టయోగం 75శాతం బాగుంది. అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగంలో శ్రేష్ఠమైన ఫలితాలున్నాయి. వ్యాపారం బాగుంటుంది. పెట్టుబడులు వృద్ధిచెందుతాయి. అష్టమ శనిదోషం వల్ల తెలియని అనారోగ్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్‌ 22వరకు భాగ్య బృహస్పతి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు. 23 నుంచి గురువు దశమంలో శ్రమతో కూడిన ఫలితాలనిస్తాడు. శని అష్టమంలో ఉన్నందున మానసిక ఒత్తిడి ఉంటుంది. శనిశ్లోకం చదువుకోవాలి. రాహువు అక్టోబరు 31వరకు దశమంలో కార్యసిద్ధినిస్తున్నాడు. నవంబరు నుంచి విఘ్నాలు కలిగించే అవకాశం ఉంది. అక్టోబరువరకు మిశ్రమంగా ఉన్న కేతువు నవంబరు నుంచి దివ్యమైన శుభఫలితాలను అందిస్తాడు.

.

ఆదాయం 14; వ్యయం 2; రాజపూజ్యం 1; అవమానం 7
అద్భుతమైన ధనయోగం సూచితం. అదృష్టయోగం 50శాతం ఉంది. ఏప్రిల్‌ 22 తర్వాత గురు బలం వల్ల విద్యార్థులు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. ఉద్యోగంలో కష్టానికి తగిన ఫలితముంది. వ్యాపారంలో పెట్టుబడులు పెరుగుతాయి. ఆస్తిని వృద్ధిచేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. గురువు సంచారం వల్ల ఏప్రిల్‌22 వరకు శ్రమ ఉంటుంది. 23 నుంచి అదృష్టయోగం. శని సప్తమ రాశిలో ఉన్నందువల్ల భాగస్వామితో గొడవలు ఏర్పడతాయి. సర్దుకుపోవాలి. రాహువు అష్టమం, నవమల్లో ఉండటంవల్ల ఈ ఏడాదంతా యోగించడం లేదు. వివాదాలకు దూరంగా ఉండాలి. కేతువు అక్టోబరు 31 వరకు మూడోరాశిలో సంచరించడం వల్ల శుభఫలితం ఉంటుంది. ఆ తర్వాత రెండో రాశిలో విఘ్నాలుంటాయి కనుక కేతు శ్లోకం చదువుకోవాలి.

.

ఆదాయం 2 వ్యయం 11
రాజపూజ్యం 4 అవమానం 7
ఖర్చు విషయంలో జాగ్రత్తపడాలి. సౌమ్యంగా సంభాషించాలి. అదృష్టయోగం 50శాతం బాగుంది. ఏప్రిల్‌ 22వరకు గురుబలం వల్ల ఎదురుచూస్తున్న పనుల్లో మంచి జరుగుతుంది. విద్యాపరంగా శుభఫలితాలున్నాయి. ఉద్యోగంలో పూర్వార్థం బాగుంటుంది. తర్వాత గురుబలం లేనందున ఏకాగ్రతతో పనిచేయాలి. పనులు వాయిదా వేయవద్దు. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. గురువు సప్తమంలో ఉన్నంతకాలం శుభయోగాలుంటాయి. ఏప్రిల్‌ 23 నుంచి అష్టమ సంచారం వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. గురుశ్లోకం చదువుకోవాలి. శని సంవత్సరమంతా షష్ఠ స్థానంలో ఉన్నందువల్ల గొప్ప అదృష్టం కలుగుతుంది. రాహువు అష్టమస్థానంలో అక్టోబరు 31వరకు తర్వాత సప్తమ స్థానంలోనూ ఆటంకాలు కలిగిస్తాడు. రాహుశ్లోకం చదువుకోవాలి. కేతువు ద్వితీయంలో అక్టోబరు 31 వరకు, ఆ తర్వాత జన్మకేతువు నిరాశ, వైరాగ్యం వంటి ఇబ్బందికరమైన ఫలితాలతో
ఉత్సాహాన్ని తగ్గించే అవకాశం ఉంది.

.

ఆదాయం 14; వ్యయం 11; రాజపూజ్యం 7; అవమానం 7
ధర్మమార్గంలో ఆర్థికవృద్ధి సూచితం. స్థిరాస్తులకై ధనాన్ని వెచ్చిస్తారు. అదృష్టయోగం 50శాతం బాగుంది. విద్యలో రాణిస్తారు. ఉద్యోగపరంగా శ్రేష్ఠమైన ఫలితాలున్నాయి. వ్యాపారంలో లాభాలను సొంతం చేసుకుంటారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. విదేశ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఇంట్లో మంచి జరుగుతుంది. ఏప్రిల్‌ 23నుంచి గురువు వల్ల అదృష్టం లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు ఉంటాయి. శని పంచమంలో ఉన్నందువల్ల ఆలోచనల్లో స్పష్టత లోపించకుండా శని శ్లోకం చదువుకోవాలి. రాహువు అక్టోబరు 31వరకు సప్తమంలో ఇబ్బంది కలిగించవచ్చు. నవంబరు నుంచి శుభయోగం ఉంది. కేతువు జన్మరాశిలో అక్టోబరు 31 వరకు ఉండి ఆ తర్వాత ద్వాదశంలో ఉండడంతో ఉత్సాహం తగ్గే అవకాశం ఉంది. కేతుశ్లోకం చదువుకోవాలి.

.

ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 3; అవమానం 3
విశేషమైన కృషిచేయాలి. అదృష్టయోగం 75శాతం బాగుంది.సంకల్పం సిద్ధిస్తుంది. కాలం సహకరిస్తుంది. ఏప్రిల్‌ 22వరకు విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగంలో పూర్వార్థంలో అనుకున్న ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో శాంతి లభిస్తుంది. కుటుంబసభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఏప్రిల్‌ 22 వరకు గురువు పంచమంలో ఉత్తమ ఫలితాలనిస్తాడు. 23 తర్వాత ఇబ్బందులను అధిగమించడానికి గురుశ్లోకం చదువుకోవాలి. అర్థాష్టమ శనిదోషముంది. శనిశ్లోకం చదువుకోవాలి. రాహువు పూర్వార్థంలో ఆరవరాశిలో శుభఫలితాలుంటాయి. తర్వాత పంచమంలో ఆలోచనల్లో స్పష్టత ఉండదు. నవంబరు నుంచి లాభకేతువు విశేషమైన శుభ ఫలితాలనిస్తాడు.

.

ఆదాయం 8; వ్యయం 11
రాజపూజ్యం 6; అవమానం 3
ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. మీ ప్రతిభను గుర్తించి ఆదరించేవారు పెరుగుతారు. అదృష్టయోగం 75 శాతం బాగుంది. అనుకున్నది సాధిస్తారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఫలితాలు ఇప్పుడు వస్తాయి. విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణిస్తారు. ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. అధికారయోగం సూచితం. పెద్దలను మెప్పిస్తారు. వ్యాపార లాభాలున్నాయి. విశేష ధన ధాన్య యోగాలు సూచితం. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. విదేశ ప్రయాణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. గృహవాతావరణం ప్రశాంతతనిస్తుంది. సంకల్పసిద్ధి ఉంటుంది. గురువు చతుర్థంలో ఉన్నందువల్ల ఏప్రిల్‌ 22 వరకు మిశ్రమ
ఫలితాలు, 23 నుంచి పంచమంలో బ్రహ్మాండమైన అదృష్టయోగాన్ని పొందవచ్చు. శని తృతీయంలో విశేషమైన కార్యసిద్ధిని ప్రసాదించడం వల్ల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. రాహువు అక్టోబరు 31 వరకు పంచమ స్థానంలో ఆ తర్వాత చతుర్థ స్థానంలో ఇబ్బందికర ఫలితాలను కలిగిస్తాడు కాబట్టి రోజూ రాహుశ్లోకం చదువుకుంటే విఘ్నాలు తొలగుతాయి. కేతువు అక్టోబరు 31 వరకు ఏకాదశంలో, నవంబరు నుంచి దశమంలో సంచరించడం వల్ల శుభఫలితాలుంటాయి. కేతువు వల్ల విశేష అదృష్ట యోగం లభిస్తుంది.

.

ఆదాయం 11; వ్యయం 5
రాజపూజ్యం 2; అవమానం 6
ధనయోగం సూచితం. స్థిరాస్తులు వృద్ధిచెందుతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. అదృష్టయోగం 50శాతం బాగుంది. పట్టుదలగా పనిచేస్తే గ్రహబలం సహకరిస్తుంది. విద్యార్థులకు మిశ్రమంగా ఉంటుంది. ప్రయత్నబలాన్ని బట్టి రాణిస్తారు. ఉద్యోగంలో సకాలంలో పనులు పూర్తిచేయాలి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన ప్రయత్నాలు చేయాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబంలో ప్రేమానురాగాలతో నడచుకోవాలి. ఏప్రిల్‌ 22 తర్వాత అర్ధాష్టమ బృహస్పతి యోగం ఇబ్బంది కలిగిస్తుంది. మనోబలంతో లక్ష్యాలను సాధించాలి. ఏలినాటి శని దోషం వల్ల తెలియని ఆటంకాలు ఏర్పడతాయి. శనిశ్లోకం చదువుకోవాలి. చతుర్థంలో అర్ధాష్టమ రాహువు అక్టోబరు 31 వరకు విఘ్నాలు కలిగిస్తాడు, రాహుశ్లోకం చదువుకోవాలి. నవంబరు నుంచి శుభఫలితాలు ఉంటాయి. కేతువు దశమంలో అక్టోబరు 31వరకు విజయాన్ని ప్రసాదిస్తాడు. తర్వాత శ్రమ పెరుగుతుంది, కేతు శ్లోకం చదువుకోవాలి.

.

ఆదాయం 11; వ్యయం 5; రాజపూజ్యం 5; అవమానం 6
అద్భుతమైన ధనలాభాలుంటాయి. స్థిర చరాస్తులు వృద్ధిచెందుతాయి. అదృష్టయోగం 50శాతం బాగుంది. పనులు వాయిదా వేయకుండా లక్ష్యాన్ని చేరుకోవాలి. విద్యార్థులు శుభఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో ఏప్రిల్‌ వరకు ఎదుగుదలకు అనుకూలం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తాయి. వ్యాపారంలో పూర్వార్థంలో మంచి ఫలితాలున్నాయి. పెట్టుబడులు పెరుగుతాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. గురువు ద్వితీయంలో బ్రహ్మాండమైన శుభఫలితాలనిస్తాడు. జన్మరాశిలో ఏలినాటి శని ప్రభావం చూపుతుంది. రాహువు తృతీయ స్థానంలో అక్టోబరు 31 వరకు కార్యసిద్ధినిస్తాడు. నవంబరు నుంచి ద్వితీయంలో ఉండటం వల్ల కుటుంబ కలహాలు, ఆర్థిక నష్టాలు చోటుచేసుకోవచ్చు. రాహుశ్లోకం చదువుకోవాలి.

.

ఆదాయం 8; వ్యయం 11; రాజపూజ్యం 1; అవమానం 2
భూగృహవాహనాది యోగాలను పొందే క్రమంలో రుణసమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. అదృష్టయోగం 25శాతమే బాగుంది. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. గురుబలం వల్ల విద్యార్థులు విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఏప్రిల్‌ నుంచి కలిసివస్తుంది. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యా ఉద్యోగ అవకాశాలపరంగా విదేశ ప్రయాణ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. సమష్టి నిర్ణయాలతోనే ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఏప్రిల్‌ 23 నుంచి ధనస్థానంలో గురువు ఉండి విశేషమైన కార్యసిద్ధినిస్తాడు. శని ద్వాదశస్థానంలో ఉన్నందున ఈ ఏడాది నుంచి ఏలినాటి శని మొదలవుతుంది. అక్టోబరు 31 వరకు ద్వితీయంలో, తర్వాత జన్మరాశిలో రాహువు శ్రమ కలిగిస్తాడు. కేతువు అష్టమ, సప్తమ స్థానాల్లో ఇబ్బందులు కలిగిస్తాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.