నగరాల నుంచి గ్రామాలకు శరవేగంగా విస్తరిస్తూ బెంబేలెత్తిస్తోన్న కరోనా మహమ్మారి కాటుకు అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఉత్తర్ప్రదేశ్ నోయిడాకు సమీపంలోని జలాల్‌పూర్ గ్రామంలో కరోనాతో చనిపోయిన పెద్ద కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించాడు ఓ తండ్రి. శ్మశానవాటిక నుంచి తిరిగి వచ్చిన అతనికి .. చిన్న కుమారుడు సైతం మరణించాడన్న పిడుగులాంటి వార్త విని కుప్పకూలిపోయాడు. ఒకే రోజు.. ఇద్దరు కుమారుల మరణంతో ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని ఆపడం బంధువులు, గ్రామస్థుల వల్ల కాలేదు.
గ్రామంలో భయం..
తమ గ్రామంలో కరోనా మరణాలు కొనసాగుతున్నాయని.. గత 10 రోజుల్లో 18 మంది చనిపోయారని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామంలో ఆసుపత్రి లేనందు వల్ల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: చనిపోయిన తర్వాత కొవిడ్ మృతదేహానికి ఆక్సిజన్