పంజాబ్‌కు చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌ను కోల్‌కతాలో ప్రత్యేక కార్యదళం బుధవారం ఎన్కౌంటర్ చేసింది. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారి కూడా గాయపడ్డారు. నిందితులను జైపాల్ సింగ్ భుల్లర్, జస్ప్రీత్ సింగ్‌లుగా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం..
న్యూటౌన్ ప్రాంతంలోని ఓ అపార్టుమెంట్లో నిందితులు ఉన్నారని వివిధ రాష్ట్రాలకు చెందిన నిఘా సంస్థలు స్థానిక పోలీసులకు సమాచారం అందించాయి. ఈ మేరకు ప్రత్యేక కార్యదళం ఆ ప్రాంతానికి చేరుకుంది. అరెస్టుకు ప్రయత్నించగా అధికారులపై నిందితులు కాల్పులు జరిపారు. దాడిని ప్రతిఘటిస్తూ పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితులు మృతిచెందారు. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారి కూడా గాయపడ్డారు.
ఘటనా స్థలం నుంచి రూ.7 లక్షల నగదు, 9 ఎంఎం పిస్టోళ్లు సహా పలు మారణాయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై రివార్డు..
పంజాబ్‌లోని వివిధ హత్య, దోపిడీ కేసుల్లో నిందితులు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారని అధికారులు వెల్లడించారు. వీరికి అంతర్రాష్ట్ర మారణాయుధ ముఠాలతో కూడా సంబంధాలు ఉన్నాయని తెలిపారు. జైపాల్‌పై రూ.10 లక్షలు, జస్ప్రీత్పై రూ.5 లక్షల రివార్డు ఉందని పేర్కొన్నారు. నిందితులు గత కొంతకాలంగా బంగాల్లోని నేరస్థులకు మారణాయుధాలను సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి : మమతా బెనర్జీని కలిసిన రైతు నేతలు