జమ్ముకశ్మీర్.. షోపియాన్ జిల్లా చెక్‌సాదిఖ్ ఖాన్ ప్రాంతంలో భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. మృతుల్లో ఒకరు ఎల్‌ఈటీ కమాండర్ అబూ అక్రమ్ అని వెల్లడించారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు వివరించారు.
ఎల్‌ఈటీ కమాండర్ అబూ అక్రమ్.. 2017 నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం 80 మంది ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారన్నారు.
ఇదీ చదవండి: జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్- ముగ్గురు ఉగ్రవాదులు హతం