మధ్యప్రదేశ్ మండ్ల జిల్లా మోతినాల లాల్‌పుర్ గ్రామ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళా నక్సలైట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇరువర్గాల మధ్య దాదాపు 4 గంటల పాటు కాల్పులు జరిగాయి.
బాలాఘాట్‌లో..
అంతకుముందు బాలాఘాట్ జిల్లా కిర్నాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోర్వాన్ అటవీ ప్రాంతంలోనూ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులను పోలీసులు హతమార్చారు. వారి నుంచి 12 రైఫిల్స్, ఇతర మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మహిళా మావోయిస్టులపై 20 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.