ETV Bharat / bharat

కబడ్డీ బాగా ఆడుతున్నాడని బాలుడి హత్య.. కిడ్నాప్ చేసి రాయితో తలపై కొట్టి.. - బాలుడిని చంపిన మైనర్లు

కబడ్డీ బాగా ఆడుతున్నాడన్న అసూయతో 12 ఏళ్ల బాలుడిని హత్య చేశారు అతడి స్నేహితులు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

two minors killed his friend
హత్య
author img

By

Published : Nov 8, 2022, 10:46 PM IST

ఛత్తీస్​గఢ్​ దుర్గ్​లో దారుణం జరిగింది. కబడ్డీ బాగా ఆడుతున్నాడన్న అసూయతో 12 ఏళ్ల బాలుడిని అతడి ఇద్దరు స్నేహితులు హత్య చేశారు. మృతుడిని సమీర్​ సాహుగా పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరూ మైనర్​లేనని పోలీసులు తెలిపారు. అక్టోబరు 21న జరిగిన ఈ మర్డర్ కేసును పోలీసులు తాజాగా ఛేదించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు, నిందితులు కలిసి కబడ్డీ ఆడుకునేవారు. సమీర్ సాహు కబడ్డీ మెరుగ్గా ఆడేవాడు. ఈ విషయంలో అతడి స్నేహితులను హేళన చేసేవాడు. దీంతో అతడిపై కోపం పెంచుకున్న ఇద్దరు మైనర్ స్నేహితులు సమీర్​ను కిడ్నాప్ చేశారు. అనంతరం ఓ నర్సరీకి తీసుకెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి.. తలపై రాయితో కొట్టి హత్య చేశారు. మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో చుట్టి అక్కడ పడేశారు.

పోలీసులకు నర్సరీ సమీపంలో అక్టోబరు 24న గుర్తు తెలియని మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న దుర్గ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ మృతదేహం సమీర్ సాహుదిగా గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి కేసును ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మృతుడి మైనర్ స్నేహితులు ఇద్దరినీ ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. నిందితులిద్దరూ వారు చేసిన నేరాన్ని పోలీసులు ఎదుట అంగీకరించారు. నిందితులిద్దరినీ బాలల కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.

ఇవీ చదవండి: గుజరాత్​లో కాంగ్రెస్​కు షాక్​.. 10 సార్లు గెలిచిన ఎమ్మెల్యే భాజపా గూటికి

ఐఐఎం హాస్టల్ భోజనంలో పురుగులు, ఇనుప తీగలు.. విద్యార్థుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.