మహారాష్ట్రలో ఓ 20 ఏళ్ల యువతిని అత్యాచారం చేసిన ఘటనలో పోలీసులు నలుగుర్ని అరెస్టు చేశారు. మరో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పుణె జిల్లాలోని డెహు పట్టణంలో జరిగింది.
ఇదీ జరిగింది..
నిందితుల్లో ఒకరితో యువతి సన్నిహితంగా ఉండేది. ఆ వీడియోలు బయటపెడతామని బెదిరించి నిందితులు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. విసిగిపోయిన యువతి.. తన బంధువులకు విషయం చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు.
నిందితుల్లో నలుగురు 19 నుంచి 32 ఏళ్ల మధ్య ఉన్నారని తెలిపారు. అదుపులోకి తీసుకున్న మైనర్లకు 15 ఏళ్లు ఉంటాయని వెల్లడించారు.
ఇదీ చదవండి: భర్తను చంపి.. వంటింట్లో పూడ్చిపెట్టి..