ETV Bharat / bharat

యువతుల మధ్య లవ్​.. పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని..

Two girls love: కర్ణాటకలోని తుమకూరులో ఓ ఇద్దరు యువతులు పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే తమ వివాహాన్ని పోలీసులు, పెద్దలు ఒప్పుకోకపోవడం వల్ల ఆ గ్రామం వదిలి వెళ్లిపోయారు. చివరకు కుటుంబసభ్యులు సర్దిచెప్పి వారిని ఇంటికి తీసుకెళ్లారు.

d
d
author img

By

Published : May 13, 2022, 3:23 PM IST

Two girls love: బిహార్​లో ఇద్దరు యువతులు ప్రేమించుకుని.. వారి బంధానికి తల్లిదండ్రులు అడ్డు చెప్పారని పోలీసులను ఆశ్రయించిన ఉదంతం మరువక ముందే ఇటువంటిదే మరొక ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. ఆ రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో ప్రేమలో మునిగి తేలుతున్న ఇద్దరు యువతులు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. పెద్దలు ఒప్పుకోలేదని ఇంటి నుంచి పారిపోయారు.

ఇదీ జరిగింది.. పావగడ ప్రాంతానికి చెందిన ఓ 22 ఏళ్ల యువతి తుమకూరులోని ఓ కళాశాలలో డిప్లొమా కోర్సు చేస్తోంది. అదే కాలేజీలో తుమకూరుకు చెందిన మరో యువతితో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరూ వివాహం చేసుకోవాలని భావించారు. కానీ ఈ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడం వల్ల పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు కూడా యువతుల వివాహానికి అంగీకరించలేదు. దీంతో వారు ఆ గ్రామం విడిచి వెళ్లిపోయారు. అయితే పెద్దలను, పోలీసుల నుంచి తప్పించుకు వెళ్లిపోయిన ఈ యువతులు గురువారం మళ్లీ తుమకూరుకు వచ్చారు. యువతులు తిరిగి వచ్చినట్టు సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు వారు ఉన్న చోటుకు చేరుకున్నారు. పోలీసుల సాయంతో వారికి నచ్చజెప్పి ఇళ్లకు తీసుకెళ్లారు.

ఇదీ చూడండి : యువతుల మధ్య చిగురించిన ప్రేమ.. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.