ETV Bharat / bharat

ఇద్దరు యువతులపై ఆరుగురి అత్యాచారం - Bazarisara Police Station

దేశంలో వేర్వేరు చోట్ల అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. అసోంలో​ ఇద్దరు యువతులపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాళ్ల ఫిర్యాదు మేరకు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మహారాష్ట్రలోనూ ఓ పాఠశాల బాలికపై ఫేస్​బుక్​లో పరిచయమైన వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు.

Two girls brutally raped by 6 men in Assam's Karimganj district+byte_AS10036
దేశంలో ముగ్గురు బాలికలపై అత్యాచారం
author img

By

Published : Nov 15, 2020, 9:23 AM IST

Updated : Nov 15, 2020, 12:45 PM IST

అసోం కరీమ్‌గంజ్ జిల్లాలోని నీలంబజార్‌లో దారుణం జరిగింది. ఇద్దరు యువతులపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిద్దరూ సిల్చార్ మెడికల్ కాలేజీ నుంచి అద్దె కారులో త్రిపురకు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సిల్చార్​ కళాశాలలో చికిత్స పొందుతున్న తల్లిని చూసేందుకు వారిద్దరూ వెళ్లారు. అనంతరం ఓ అద్దె కారులో అక్కడి నుంచి బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో కారును దారి మళ్లించి నీలంబజార్​ ప్రాంతంలోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి తీసుకెళ్లాడు డ్రైవర్​. మరో ఐదుగురితో కలిసి ఇద్దరు యువతులపై అత్యాచారానికి ఒడిగట్టారు.

ఘటనా స్థలం నుంచి తప్పించుకున్న బాధితురాళ్లు... బజారిసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అబ్దుల్​ అహాద్​గా గుర్తించిన అధికారులు.. పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

మహారాష్ట్రలో దారుణం..

మహారాష్ట్ర సింధుదుర్గ్​ జిల్లాలో ఓ పాఠశాల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఫేస్​బుక్​లో పరిచయమైన భూషణ్ మాడియే అనే వ్యక్తే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ నెల 12న కలవాలంటూ ఫోన్​ చేసి బాలికను పిలిపించాడు. అనంతరం లాడ్జ్​కు తీసుకెళ్లి తన స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని రికార్డు చేసి... విషయాన్ని ఎవరికైనా చెప్తే, వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్​ చేస్తామని ఆ బాలికను బెదిరించాడు. అయితే బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

బిహార్​లోనూ..

బిహార్​ రోహతాస్​ జిల్లాలోని ఓ గ్రామంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఎనిమిదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి... అనంతరం హత్య చేశాడు ఓ కీచకుడు. అందరూ దీపావళి రోజు బాణాసంచి కాల్చుతూ ఎంతో సంతోషంగా ఉండగా... అదే గ్రామానికి చెందిన బలరాం అనే వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

దీపావళి పూజ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ బాలిక కనిపించలేదు. దీంతో గ్రామస్థుల సాయంతో బాలిక కోసం వెతకగా.. నిందితుడు బలరాం సింగ్​ ఇంట్లోని ఓ పెట్టెలో బాలిక శవమై కనిపించింది. ఆగ్రహానికి గురైన గ్రామ ప్రజలు... బలరాంకు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. నిందితుడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇదీ చూడండి: ఒక్క లేఖతో చిన్నారి కుటుంబంలో 'దీపావళి' వెలుగులు

Last Updated : Nov 15, 2020, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.