మహారాష్ట్రలోని పూణెలో విషాద ఘటన జరిగింది. వాఘోలిలోని సొలాసియా సొసైటీకి చెందిన సెప్టిక్ ట్యాంక్‌ను క్లీన్ చేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. అయితే ఊపిరి ఆడనందుకే వారు మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో 18 అడుగుల లోతు గల సెప్టిక్ ట్యాంక్‌లో ముగ్గురు కార్మికులు ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. అప్పటికే ఇద్దరు కార్మికులు మృతిచెందగా, వారి మృతదేహాలను ఫైర్ సిబ్బంది వెలికితీశారు. ఆ తర్వాత మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టి మూడో వ్యక్తి మృతదేహాన్ని కూడా బయటకుతీశారు. మృతి చెందిన వ్యక్తులను నితిన్ ప్రభాకర్ గోడ్, గణేష్ భలేరోతో పాటు సతీశ్ కుమార్ చౌదరీగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: ప్లేట్లెట్లకు బదులు ఫ్రూట్ జ్యూస్ ఎక్కించిన వైద్యులు.. డెంగీ రోగి మృతి
బెంగళూరు అతలాకుతలం.. చెరువులుగా మారిన రహదారులు.. అనేక ఇళ్లు ధ్వంసం