ETV Bharat / bharat

నడిరోడ్డుపై ఇద్దరు వృద్ధుల హత్య.. అరగంటపాటు ఇటుకలు, ఇనుప రాడ్లతో దాడి చేసి.. - నడిరోడ్డుపై ఇద్దరు వృద్ధుల హత్య

Two Elders Murder Dragged Dead Body : బిహార్ భాగల్​పుర్​లో దారుణం జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇద్దరు వృద్ధులను అత్యంత పాశవికంగా హత్య చేశాడు ఓ దుండగుడు.

two elders murder and dragged dead body
ఇద్దరు వృద్ధుల దారుణ హత్య
author img

By

Published : Aug 17, 2023, 10:45 PM IST

Updated : Aug 17, 2023, 10:54 PM IST

Two Elders Murder Dragged Dead Body : స్వాతంత్ర్య దినోత్సవం రోజునే నడిరోడ్డుపై దారుణం జరిగింది. బిహార్​లోని భాగల్​పుర్​లో ఇద్దరు వృద్ధులను అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. అనంతరం వారిలో ఒకరి మృతదేహాన్ని జాతీయ రహదారిపై దాదాపు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన నడి రోడ్డుపై జరుగుతున్నా.. వీరిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

మహ్మద్​ ఆజాద్​ అనే వ్యక్తి ఇద్దరు వృద్ధులను దారుణంగా హత్య చేశాడు. ఇటుకలు, ఇనుప రాడ్లతో వారిపై అత్యంత పాశవికంగా దాడి చేశాడు. దాదాపు అరగంట పాటు గొలుసులతో కట్టేసి కొట్టాడు. ఈ దాడిలో వృద్ధుడు అక్కడిక్కడే చనిపోగా.. వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అందులో ఒకరి మృతదేహాన్ని జాతీయ రహదారి 80పై దాదాపు 500 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. ఆ తర్వాత మళ్లీ ఘటనా స్థలానికి తిరిగివచ్చి స్థానికులతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు నిందితుడు అజాద్​ను పట్టుకుని తీవ్రంగా కొట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని కస్టడీకి తరలించారు. యువకుడు కొన్ని రోజులుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని చాలా రోజులుగా ఇంట్లోనే కట్టేసి ఉంచారు. అయితే మూడు రోజులు క్రితం ఇంట్లో నుంచి తప్పించుకుని వచ్చినట్లు తెలిపారు.

రాడ్లు, కర్రలతో దాడి చేసి..
బిహార్‌లోని గయాలో ఇద్దరు చిన్నారుల మధ్య వివాదం విధ్వంసానికి దారితీసింది. ఓ స్వీట్ వ్యాపారి కుటుంబంపై రాడ్లు, కర్రలతో దుండగులు దాడి చేశారు దుండగులు. అక్కడితో ఆగకుండా వారిపై వేడినూనెను పోశారు. అలాగే దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో బయటకి రావడం వల్ల అసలు విషయం బయటపడింది.

అసలేం జరిగిందంటే..
అంబటారి గ్రామంలో ఇద్దరు చిన్నారులు ఆడుకునే సమయంలో గొడవపడ్డారు. ఈ విషయం చిన్నారి తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన చిన్నారి కుటుంబ సభ్యులు.. స్వీట్ వ్యాపారి రాజేశ్ కుటుంబంపై దాడి చేశారు. వేడి నూనెను రాజేశ్​ కుటుంబ సభ్యులపై పోసేశారు. దీంతో వారికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో నిందితులపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని రాజేశ్..​ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.

బావిలో కూరుకుపోయి ఐదుగురు మృతి.. ఎద్దును రక్షించబోయి..

పెళ్లి చేసుకోలేదని కోపం.. ప్రియుడి 11ఏళ్ల కొడుకు దారుణ హత్య.. ఇంటికి వెళ్లి మరీ..

Last Updated : Aug 17, 2023, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.