ETV Bharat / bharat

వాహనదారులపై పులి దాడి.. ఇద్దరు మృతి - పులి దాడి వార్తలు

ఉత్తర్​ప్రదేశ్​ పీలీభీత్​ జిల్లాలో పులి దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

tiger attack on people in pilibhit
వాహనదారులపై పులి దాడి.. ఇద్దరు మృతి
author img

By

Published : Jul 12, 2021, 11:21 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ పీలీభీత్​ జిల్లాలో జరిగిన పులి దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు దియోరియా గ్రామస్థులుగా అధికారులు గుర్తించారు. పులి దాడితో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఇదీ జరిగింది..

దియోరియా గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. సమీపంలోని పూరన్​పుర్​ నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఉన్న అటవీ ప్రాంతంలో వారిపై పులి దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు.

tiger attack on people in pilibhit
పులి దాడిలో మృతి చెందిన వ్యక్తి
tiger attack on people in pilibhit
బాధితులు ఉపయోగించిన వాహనం

దర్యాప్తు చేస్తుండగా..

పీలీభీత్​ టైగర్​ రిజర్వ్​లోని దియోరియా రేంజ్​లో వేటగాళ్లు ప్రవేశించినట్టు అధికారులకు ఆదివారం సమాచారం అందించింది. వేటగాళ్లను అరెస్ట్​ చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో పులి దాడి జరిగినట్టు వెల్లడైందని అధికారులు వెల్లడించారు.

పులి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి : Viral Video: గ్రామంలోకి చిరుతలు.. వణికిపోతున్న ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.