ETV Bharat / bharat

రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకొని.. బాలికపై వరుడి అత్యాచారం​ - హత్య

Bridegroom Raped a Minor Girl: మరో రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకొని మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వరుడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. నిందితుడు వాయుసేన అధికారి అని పోలీసులు గుర్తించారు. మరో ఉదంతంలో 17 నెలల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు 60 ఏళ్ల వృద్ధుడు. రాజస్థాన్​లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Bridegroom Raped a Minor Girl
maharashtra rape victim
author img

By

Published : May 11, 2022, 4:32 PM IST

Bridegroom Raped a Minor Girl: మహారాష్ట్ర నాగ్​పుర్​లో దారుణం వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకొని 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఎయిర్​ ఫోర్స్​ అధికారి. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఆదిత్యధన్​రాజ్​ నరేశ్ శాహూగా (28) గుర్తించారు.

ఇదీ జరిగింది: వాయుసేనలో మరో రాష్ట్రంలో కార్పొరల్​గా పనిచేస్తున్నాడు నిందితుడు నరేశ్ శాహూ. మే 12న జరగనున్న తన వివాహం కోసం ఇంటికి వచ్చాడు. మరో రెండు రోజుల్లో పెళ్లి ఉందనగా.. తన ప్రాంతంలోని ఓ ఇంట్లోకి చొరబడి మైనర్​పై అత్యాచారం చేశాడు. ఎవరితోనైనా చెప్తే చంపేస్తానని ఆమెను బెదిరించాడు.

అయితే తల్లిదండ్రలు ఇంటికి వచ్చాక జరిగిన విషయం వారితో చెప్పింది ఆ బాలిక. అనంతరం వారు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు కటకటాల పాలయ్యాడు. శాహూ కాబోయే భార్యది మరో రాష్ట్రం. పెళ్లి నాగ్​పుర్​లో జరగనుండగా.. దానికోసం వారు అక్కడకు చేరుకోగానే విషయం తెలిసింది. దీంతో వారు షాక్​లో ఉన్నారు.

17 నెలల చిన్నారిపై 60ఏళ్ల వృద్ధుడు: రాజస్థాన్​ భరత్​పుర్​ జిల్లాలో జరిగిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బయానా పోలీస్​ స్టేషన్​ పరిధిలో 17 నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు 60 ఏళ్ల వృద్ధుడు. కూలీల కోసం తల్లి టెంట్​లో వంట చేస్తుండగా.. చిన్నారి ఏడుస్తూ ఉంది. దీంతో సముదాయించమని స్థానికంగా ఉండే వృద్ధుడికి పాపను అప్పగించిన ఆ తల్లి.. వంట చేయడానికి వెళ్లింది. అనంతరం ఆ పాపను రైల్వే కల్వర్ట్​ కిందకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు వృద్ధుడు.

చిన్నారి ఏడుపులు విని తల్లిదండ్రులు కల్వర్ట్​ వద్దకు చేరుకోగానే.. ఆమెను అక్కడే వదిలేసి అతడు పారిపోయాడు. దీని గురించి వారు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లబోతుంటే ఓ 10-15 మంది వారిని అడ్డగించి చంపేస్తామని బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో భయపడిన బాధిత కుటుంబం వారి స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఫలితంగా నిందితుడిపై ఎఫ్​ఐఆర్​ నమోదు కాలేదు. చిన్నారికి వైద్యం కూడా అందలేదు.

నాలుగు రోజుల అనంతరం.. మంగళవారం రాత్రి బయానాకు చేరుకొని ఘటనపై పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు పాప కటుంబసభ్యులు. చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అరెస్టు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

12 ఏళ్ల బాలికపై మాటువేసి మరీ..: మహారాష్ట్రలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పుణెలోని ఛించ్వాడ్​లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. ఏప్రిల్​ 21న బాలిక పిండి మిల్లుకు వెళ్తున్న సమయంలో ఆమె కోసం మాటు వేసి.. తమ గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలుంటాయని బాలికను బెదిరించారు. ఆమెపై సోమవారం మరోసారి లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో 18, 21 ఏళ్ల వయసున్న ఆ నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.

సవతి కొడుకుల గొంతుకోసి..: ఆస్తి తగాదాలతో ఇద్దరు సవతి కొడుకులను హత్య చేసిన కుసుమ్​ అనే మహిళను బుధవారం అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని దేవరియాలో జరిగింది. చనిపోయినవారిని అజయ్ (18), అభిషేక్(15)గా పోలీసులు గుర్తించారు. ఉదయం 5గంటల సమయంలో వారు బెడ్​పై గొంతు తెగి విగతజీవులుగా పడి ఉండటాన్ని తల్లి మానసా దేవి చూడటం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన కొడుకు, కోడలుతో కలిసి నిందితురాలు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి: కన్నకూతురిపై అత్యాచారం.. నిందితుడికి 106 ఏళ్ల జైలుశిక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.