Maharashtra Road Accident Today : మహారాష్ట్రలోని బుల్డాణాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. ముంబయి-నాగ్‌పుర్ హైవేపై శనివారం వేకువజామున 3 గంటల జరిగిందీ దుర్ఘటన.
Two Buses Collide In Maharashtra : లక్ష్మీనగర్ సమీపంలోని ఫ్లై ఓవర్‌పై ప్రయాణికులతో వెళ్తున్న రెండు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సులు నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అమర్‌నాథ్ నుంచి బస్సులో 35 నుంచి 40 మంది ఉన్నట్లు సమాచారం. నాసిక్ వైపు వెళ్తున్న బస్సులో 25 నుంచి 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Buldhana Bus Accident : ప్రమాదానికి గురైన బస్సుల్లో ఒకటి అమర్‌నాథ్ యాత్ర ముగించుకుని హింగోలికి వెళ్తుండగా.. మరో ప్రైవేట్ బస్సు నాసిక్ వైపు వెళ్తోందని పోలీసులు తెలిపారు. నాసిక్ వైపు వెళ్తున్న బస్సు ట్రక్కును ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించి.. ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టిందని చెప్పారు. ఈ రోడ్డు ప్రమాదం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యిందని వెల్లడించారు. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు.
టైరు పేలి ప్రమాదం.. 26 మంది మృతి..
ఇటీవలే మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 26 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. బుల్డాణా జిల్లాలోని సిండ్ఖేడ్రాజా ప్రాంతంలో సమృద్ధి మార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిందీ ప్రమాదం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నాగ్‌పుర్ నుంచి పుణెకు 33 మందితో వెళ్తోంది. ఒక్కసారిగా టైరు పేలడం వల్ల వాహనం అదుపు తప్పింది. పక్కన ఉన్న స్తంభాన్ని, ఆ తర్వాత డివైడర్‌ను ఢీకొట్టింది. డీజిల్ ట్యాంకులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే అనేక మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.