తమిళనాడులో దారుణం జరిగింది. ఓ బంగారం వ్యాపారి కుటుంబీకులను హత్య చేసిన దుండగులు.. 15 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.
మయిళదుతురాయ్ జిల్లాలోని సిర్కాళీ రైల్వే రోడ్డులో నివసించే ధన్‌రాజ్(50).. బంగారం వ్యాపారం చేస్తూ జీవిస్తుంటాడు. బుధవారం ఉదయం ఓ నలుగురు దుండగులు అతడి ఇంట్లోకి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. ధన్‌రాజ్ భార్య ఆశ(42), అతని కుమారుడు అఖిల్(24)ను హత్య చేసి 15 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారని వెల్లడించారు. సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లను కూడా నిందితులు తీసుకువెళ్లారని చెప్పారు.
ఈ ఘటనపై పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా నిందితులను ఉత్తర భారతీయులుగా గుర్తించారు.