Two Brothers Raped Pregnant Sister : మహారాష్ట్ర.. గడ్చిరోలిలో ప్రసవం కోసం ఇంటికి వచ్చిన ఏడు నెలల గర్భిణీపై ఇద్దరు సోదరులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గడ్చిరోలి ప్రాంతంలోని కుర్ఖెడా పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన ఓ ఏడు నెలల గర్భిణీ.. ప్రసవం కోసం తన పుట్టింటికి వెళ్లింది. అయితే ఆగస్టు పదో తేదీన.. బాధితురాలి తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్రం బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న గర్భిణీపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు సోదరులు. తన తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బాధితురాలు జరిగిందంతా వారికి చెప్పింది. అనంతరం వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బాధితురాలి తరఫున తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరు పరిచారు. నిందితులను కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ఘటన తర్వాత బాధితురాలి ఆరోగ్యం క్షీణించడం వల్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన తర్వాత ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
యువతిని రేప్ చేసిన సోదరుడు..
Brother Raped Sister In Uttarpradesh : ఉత్తర్‌ప్రదేశ్‌లో.. కాన్పుర్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఓ యువతిపై తన సోదరుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయం బాధితురాలి తల్లికి తెలిసినా మౌనంగా ఉండిపోయింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు దిగింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్యాణ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ 23 ఏళ్ల యువతి నివసిస్తోంది. ఆమె సోదరుడు తనను తరచూ కొడుతూ హింసించే వాడు. ఆమెపై అత్యాచారానికి తెగబడేవాడు. ఈ విషయం గురించి బాధితురాలు తన తల్లికి చాలా సార్లు చెప్పినా.. ఆమె పట్టించుకోలేదు. అంతేగాక ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేది. మరోవైపు సోదరుడు కూడా 'ఎవరికైనా చెప్పినా.. ఎటైనా పారిపోవాలని ప్రయత్నించినా చంపేస్తాను' అని బెదిరించేవాడు. దీంతో విసుగెత్తిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కల్యాణ్‌పుర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి ధనుంజయ్ పాండే స్పందించారు. ఓ సోదరుడు తన సోదరిని రేప్ చేసిన ఘటన తమ దృష్టికి వచ్చిందని.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడిపై తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సొంత సోదరిపైనే అత్యాచారయత్నం.. సోదరుడిని కొట్టి చంపిన మహిళ
కుమార్తెపై తండ్రి అత్యాచారం.. అడ్డొచ్చిన కుమారుడిపై కాల్పులు.. స్కూల్ విద్యార్థినిపైనా..