ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూ సమీపంలో రైలు ప్రమాదం జరిగింది. అమృత్సర్ నుంచి జైనగర్ వెళ్తున్న షహీద్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రెండు బోగీలు రైలు నుంచి విడిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రెండు బోగీల్లో మొత్తం 155మంది ప్రయాణికులున్నారు.
సోమవారం ఉదయం 8 గంటలకు చార్బాగ్ రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలు దేరిన తర్వాత ప్రమాదం జరిగినట్లు సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ జగ్తోష్ శుక్లా తెలిపారు.
పట్టాలు తప్పిన బోగీల్లోని ప్రయాణికులు భయంతో అరుపులు, కేకలు పెట్టారని రైల్వే వర్గాలు తెలిపాయి. అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని నియంత్రించినట్లు పేర్కొన్నాయి.