ETV Bharat / bharat

'కరోనా అలర్ట్​ డివైజ్​'తో ప్రజలు సేఫ్​! - Patna Kalkari Sanstha

దేశంలో కరోనా వైరస్​ కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రజలు మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఇప్పుడు బిహార్​కు చెందిన ఇద్దరు విద్యార్థులు కరోనా అలర్ట్​ డివైజ్​ను తయారు చేశారు. కరోనా సోకిన వ్యక్తి నుంచి దూరంగా ఉండటానికి ఈ డివైజ్​ సాయం చేస్తుంది.

Two Bihar students
అర్పిత్​​, అభిజీత్
author img

By

Published : Apr 7, 2021, 11:48 AM IST

దేశవ్యాప్తంగా కరోనా 2.0 విజృంభిస్తోంది. ప్రాణాంతకమైన ఈ వైరస్​ విస్తరించకుండా ఉండటానికి మాస్క్​, శానిటైజర్, భౌతిక దూరం పాటించడం ఎంత అవసరమో ఈ రెండో దశ కరోనా వ్యాప్తి చెబుతోంది.

కానీ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు వైరస్​ బారిన పడుతూనే ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బిహార్​కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఒక గ్యాడ్జెట్​ను తయారు చేశారు. ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు ఉంటే ఆ గ్యాడ్జెట్​ అతడిని మీటర్​ దూరంలోనే గుర్తిస్తుంది. వెంటనే అందులోని అలారం మోగుతుంది. ఫలితంగా.. కరోనా లక్షణాలున్న ఆ వ్యక్తికి దూరంగా ఉండవచ్చు.

Government of India issues patent
విద్యార్థులు.. అర్పిత్​​, అభిజీత్

ఈ కరోనా అలర్ట్​ డివైజ్​ని పాట్నాకిల్కారీకి చెందిన 10, 12వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అర్పిత్​​, అభిజీత్​ తయారు చేశారు.

Government of India issues patent
గ్యాడ్జెట్​పై అభిజీత్​, అర్పిత్​లకు పేటెంట్​ హక్కుల్ని జారీ చేసిన భారత ప్రభుత్వం

మీటరు దూరం నుంచే ఓ వ్యక్తి శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను ఈ 'కరోనా అలర్ట్​ డివైజ్'​లో ఉండే సెన్సార్లు గుర్తిస్తాయి. ఈ డివైజ్​ చిన్నగా ఉంటుంది. షర్ట్​ జేబులో దీన్ని పెట్టుకోగలము. వ్యక్తి దగ్గినా, తుమ్మినా లేదా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నా ఈ డివైజ్ యాక్టివ్​ అయ్యి..​ అలారాన్ని మోగిస్తుంది.

"కరోనా సంక్షోభ సమయంలో, లాక్​డౌన్​ విధించినప్పుడు ప్రాణాంతకమైన ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి ప్రజలు పోరాడారు. చుట్టుపక్కల ఉన్న వారి ఉష్ణోగ్రతను గుర్తించడానికి కరోనా అలర్ట్​ డివైజ్​ను తయారు చేయాలని అప్పుడు మేము నిర్ణయించుకున్నాం."

-అభిజీత్​ కుమార్​, 12వ తరగతి విద్యార్థి

"ప్రస్తుతం ఉష్ణోగ్రతను గుర్తించే ఇలాంటి డివైజ్​కు ఖరీదు మార్కెట్​లో రూ.10,000 నుంచి 12,000 వరకు ఉంది. అంత ధరను సామాన్య ప్రజలు భరించలేరు. కానీ సామాన్యుడికి అందుబాటులో ఉంచేందుకే.. రూ.400 నుంచి రూ.600 మధ్య మా గ్యాడ్జెట్​ను రూపొందించాము. అయితే ఈ డివైజ్​ను దగ్గర ఉంచుకున్నంత మాత్రాన ఇది కరోన వైరస్​ను గుర్తించదు. కేవలం వ్యక్తిలోని అధిక ఉష్ణోగ్రతను మాత్రమే కనిపెడుతుంది."

-అర్పిత్​ కుమార్​, పదవ తరగతి విద్యార్థి

ఈ గ్యాడ్జెట్​ తయారు చేసిన విద్యార్థులకు దీనిపై పేటెంట్​ హక్కుల్ని జారీచేసింది భారత ప్రభుత్వం.

ఇదీ చదవండి: దేశంలో మరోసారి లక్ష దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.