గూఢచర్యానికి పాల్పడుతూ.. కీలక సమాచారం పాకిస్థాన్ నిఘా సంస్థ-ఐఎస్ఐకి చేరవేస్తున్న ఇద్దరు సైనికులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను హర్ ప్రీత్ సింగ్, గుర్ భేజ్ సింగ్‌గా గుర్తించారు.
ఇద్దరిలో ఒకరు అనంతనాగ్‌లోని 19వ రాష్ట్రీయ రైఫిల్స్, మరొకరు కార్గిల్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి సైనికుల విధులు, మోహరింపునకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో నిందితులు 900 దస్త్రాలను.. ఓ డ్రగ్ స్మగ్లర్‌కు అందజేశారని, అతడి నుంచి అవి ఐఎస్ఐకి అందినట్లు పంజాబ్ పోలీసులు గుర్తించారు.
ఇదీ చూడండి: ఇస్రో గూఢచర్యం కేసు: పోలీసులపై సీబీఐ ఎఫ్ఐఆర్