ఇటీవల కాంగ్రెస్ టూల్‌కిట్ పేరుతో భాజపా నేత సంబిత్ పాత్రా ట్విట్టర్లో చేసిన వివాదాస్పద ట్వీట్లు అవాస్తవమైనవని ట్విట్టర్ తెలిపింది. ఈ మేరకు సంబంధిత ట్వీట్లను మేనిప్యులేటెడ్ మీడియాగా పేర్కొంది. భాజపా నేతల ట్విట్టర్ ఖాతాలు శాశ్వతంగా తొలగించాలంటూ కాంగ్రెస్ గురువారం ట్విట్టర్‌కు లేఖ రాసిన నేపథ్యంలో ఆ సంస్థ ఈ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అవాస్తవమైన వీడియోలు, ఆడియోలు, ఫొటోలు ట్విట్ చేస్తే ఈ తరహా చర్యలు చేపడతామని ట్విట్టర్ స్పష్టం చేసింది.
భాజపా నేతలు చేసిన ట్వీట్లను తప్పుపడుతూ కాంగ్రెస్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేపడుతున్నారు.
ఇదీ చదవండి : మహారాష్ట్రలో ఎన్కౌంటర్- 13 మంది మావోలు హతం