ప్రముఖ సామాజిక మాధ్యమాలు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు మరో రెండు రోజుల్లో నిషేధిత జాబితాలోకి వెళ్లనున్నాయా అనే అనుమానాలు బలపడుతున్నాయి. అంతర్జాలం ద్వారా వినియోగదారులకు నేరుగా అందించే ఓటీటీ, సామాజిక మాధ్యమాల వేదికలను క్రమబద్ధీకరించేందుకు కేంద్రప్రభుత్వం ఫిబ్రవరి 25న నూతన నిబంధనలు విడుదల చేసింది. దీనిపై స్పందించేందుకు ఆయా సంస్థలకు మే25 చివరి గడువు విధించింది. ఈ గడువు నిన్నటితో ముగిసింది.
అయితే ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తాజా నిబంధనలపై స్పందించలేదని తెలుస్తోంది. కేంద్ర నిబంధనల ప్రకారం జాతి, మతపరమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించేందుకు కంపెనీ తప్పనిసరిగా అధికారిని నియమించాల్సి ఉంటుంది. అలాగే ఫిర్యాదుల పరిష్కారానికి మరొక అధికారిని నియమించాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనలపై ఆయా సామాజిక మాధ్యమ సంస్థలు స్పందన తెలియజేయకపోవడం వల్ల అవి నిషేధించే వాటి జాబితాలోకి వెళ్లనున్నాయా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
ఇదీ చూడండి: భారత్‌లోనూ పేరు మార్చుకున్న కియా