ETV Bharat / bharat

టీవీ ఛానళ్లలో చర్చల వల్లే ఎక్కువ కాలుష్యం: సుప్రీం

దిల్లీలో వాయు కాలుష్యం(delhi air pollution) తీవ్ర రూపం దాల్చింది. అందుకు పంట వ్యర్థాలను తగలబెట్టటం(stubble burning in delhi), వాహనాలు, పరిశ్రమల ద్వారా వెలువడే విషవాయువులు కారణమని తెలుసు. అయితే.. టీవీ ఛానళ్లలో చర్చల వల్లే అన్నింటికంటే ఎక్కువ కాలుష్యం(tv debates cause more pollution) ఏర్పడుతోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అందుకు కారణమేంటి?

supreme court
సుప్రీం కోర్టు
author img

By

Published : Nov 17, 2021, 3:59 PM IST

Updated : Nov 17, 2021, 4:09 PM IST

దేశ రాజధాని ప్రాంతంలో కాలుష్యంపై(delhi air pollution) విచారణ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు(Supreme court). టీవీ ఛానళ్లలో జరిగే చర్చల వల్లే ఎక్కువగా కాలుష్యం(tv debates cause more pollution) ఏర్పడుతోందని పేర్కొంది. కోర్టు ముందుకు వచ్చిన అంశాలను డిబేట్లలో పరిగణనలోకి తీసుకోకపోవటమే అందుకు కారణంగా పేర్కొంది. ప్రతి ఒక్కరికి సొంత అజెండా ఉందని, ఆయా చర్చల్లో నిజమైన కారణాలు పక్కకు వెళ్లిపోతున్నాయని అభిప్రాయపడింది సీజేఐ(cji of india) జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.

చిన్న, సన్నకారు రైతులకు పంటవ్యర్థాలను తొలగించే యంత్రాలను ఉచితంగా పంపిణీ చేయాలని పర్యావరణ కార్యకర్త ఆదిత్య దుబే, న్యాయవిద్యార్థి అమన్​ బంకా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది ధర్మాసనం.

" ఒక అంశాన్ని ఉపయోగించి వివాదాస్పదంగా మార్చాలనుకుంటున్నారు. అలా జరిగితే నిందలు మాత్రమే మిగులుతాయి. ఇతరుల కంటే టీవీ ఛానళ్లలోని చర్చలే ఎక్కువగా కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. ఏం జరుగుతోంది, సమస్య ఏమిటి? అని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. కోర్టులోని అంశాలు పక్కకు వెళ్లిపోతున్నాయి. ప్రతి ఒక్కరికీ సొంత అజెండా ఉంది. అలాంటి వాటివల్ల ఉపయోగం లేదు. మేము ఎలాంటి సాయం చేయలేం. నియంత్రించలేం. ఒక పరిష్కారం కోసం పని చేస్తున్నాం."

- ధర్మాసనం.

పంట వ్యర్థాలను తగలబెట్టటం(stubble burning in delhi) కాలుష్య(delhi air pollution) కారకాల్లో ఒకటని, దానికి పరిష్కారం కనుగొనాలని దిల్లీ తరఫున హాజరైన సీనియర్​ అడ్వకేట్​ అభిశేక్​ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. అందుకు కేంద్ర ప్రభుత్వ గణాంకాలను చూపించారు. సింఘ్వీ వాదనలపై ఈ మేరకు స్పందించింది ధర్మాసనం.

మరోవైపు.. టీవీ డిబేట్లను(tv debates cause more pollution) ప్రస్తావిస్తూ.. పంట వ్యర్థాలను తగలబెట్టే అంశంపై న్యాయస్థానాన్ని తాను తప్పుదోవపట్టిస్తున్నట్లు పేర్కొంటున్నారని కోర్టుకు తెలిపారు సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా. ' కొన్ని ఛానళ్లలో నాపై బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయటం నేను చూశాను. పంట వ్యర్థాలను కాల్చటం వల్ల కేవలం 4-7 శాతం మేర మాత్రమే ఉందని చూపించటం ద్వారా నేను కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నట్లు చెప్పారు. దానిపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా.' అని పేర్కొన్నారు. అయితే.. తాము ఎప్పుడూ తప్పుదోవ పట్టలేదని, ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నప్పుడు అలాంటి విమర్శలు వస్తాయని పేర్కొంది ధర్మాసనం. సమాజ హితం కోసం పని చేయాలని సూచించింది.

ఇదీ చూడండి: 'పదేళ్లు పైబడిన వాహనాలు రోడ్డెక్కడం నిషేధం'​

Last Updated : Nov 17, 2021, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.