ETV Bharat / bharat

వివాదాలకు తెరా? నయా రాజకీయమా?

నాలుగున్నరేళ్ల కాలంలో పుదుచ్చేరిలో ఎన్నో వివాదాలు, మరెన్నో విబేధాలు. సర్కారు రోజువారీ వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం తగదంటూ లెఫ్టినెంట్ గవర్నర్​ కిరణ్ బేడీపై ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు ఇప్పటికి తెరపడినట్లైంది. బేడీని ఆ పదవిలో నుంచి తొలగించడం వల్ల విబేధాలకు అడ్డుకట్ట వేసినట్లైంది. ఇంతకీ వీరి మధ్య ప్రతిష్టంభన ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది? పుదుచ్చేరిలో భవిష్యత్​ రాజకీయం ఎలా ఉండనుంది?

tussle between Puducherry Raj Niwas and the CM's office have come to an end
వివాదాలకు తెరా? నయా రాజకీయమా?
author img

By

Published : Feb 17, 2021, 2:32 PM IST

పుదుచ్చేరి రాజ్​నివాస్(గవర్నర్ ఉండే చోటు)​కు, సీఎం కార్యాలయానికి మధ్య ఉద్రిక్తతలకు తెరపడింది. అధికార విబేధాలు, కోర్టు గొడవలు, విధానపరమైన నిర్ణయాల్లో అనిశ్చితులు.. వీటన్నింటికీ ముగింపు లభించింది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని ఆ పదవిలో నుంచి తొలగించడమే ఇందుకు కారణం.

2016 మే 29న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్​గా బాధ్యతలు స్వీకరించారు కిరణ్ బేడీ. అప్పటి నుంచి ఆ స్థానంలో క్రియాశీలంగా పనిచేశారు. రాజ్​నివాస్​ను ప్రజలకు దగ్గర చేసేందుకు యత్నించారు. ఫిర్యాదు పరిష్కార సమావేశాల పేరిట.. పౌరుల సమస్యలు తీర్చడం వంటి పలు కార్యక్రమాలు చేపట్టారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్... లెఫ్టినెంట్ గవర్నర్ చేపడుతున్న ఈ కార్యక్రమాలపై పెదవి విరిచింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి సమాంతరంగా మరో సర్కారును బేడీ నడిపిస్తున్నారని ఆరోపణలు గుప్పించింది. అది మొదలు.. కిరణ్ బేడీ తొలగింపు వరకు.. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య తలెత్తిన విబేధాలకు అంతులేదు.

ఇదీ చదవండి: సీఎం, లెఫ్ట్​నెంట్​ గవర్నర్​ మధ్య మాటల యుద్ధం

వరుస వివాదాలు...

వాట్సాప్​లో అసభ్యకరమైన వీడియో షేర్ చేసినందుకు 2017 జనవరిలో పుదుచ్చేరి సివిల్ సర్వీసు అధికారిని లెఫ్టినెంట్ గవర్నర్ బేడీ సస్పెండ్ చేశారు. సదరు అధికారిపై విచారణ ప్రారంభించాలని పోలీసులను ఆదేశించారు. ఈ సమయంలోనే తొలిసారి బేడీ లక్ష్యంగా కాంగ్రెస్ బహిరంగంగా విమర్శలు చేసింది. తన అధికార పరిధిని దాటి ప్రవర్తించారని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే అధికారిక సంప్రదింపుల కోసం ఉన్నత ఉద్యోగులు సోషల్ మీడియాను ఉపయోగించడంపై నిషేధం విధించింది. ఈ ఉత్తర్వులను బేడీ రద్దు చేయడం నారాయణసామి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుకు ఆగ్రహం తెప్పించింది.

ఇదీ చదవండి: "కిరణ్​ బేడీని వెనక్కు పిలవాల్సిందే"

ఆ తర్వాత నుంచి ప్రభుత్వం తీసుకునే సాధారణ నిర్ణయాలపైనా ప్రతిష్టంభన ఏర్పడుతూ వచ్చింది. బీచ్​లో కొత్త సంవత్సర సంబరాలు జరుపుకునేందుకు అనుమతించే విషయంపైనా విబేధాలు తలెత్తాయి. చిన్న చిన్న అంశాలపై ఎదురవుతున్న అడ్డంకులపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది పుదుచ్చేరి కాంగ్రెస్ సర్కార్. బేడీ నియంతృత్వ పోకడలతో, అనైతికంగా వ్యవహరిస్తున్నారని ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్​నాథ్ సింగ్​కు లేఖ సమర్పించారు.

ఇదీ చదవండి: పుదుచ్చేరి సీఎంకు సుప్రీంకోర్టు నోటీసులు

అనంతరం, పుదుచ్చేరి అసెంబ్లీలో నామినేటెడ్ పదవులపైనా వివాదం నెలకొంది. అసెంబ్లీలో ఉన్న మూడు నామినేటెడ్ స్థానాలకు ముగ్గురు భాజపా నేతల పేర్లను కేంద్రం ఖరారు చేసింది. వీరి నియామకాన్ని అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది పుదుచ్చేరి సర్కార్. వారికి అసెంబ్లీలోకి అనుమతి నిరాకరించింది. ఈ సభ్యులతో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రమాణస్వీకారం చేయించడం.. విబేధాలకు మరింత ఆజ్యం పోసింది.

హైకోర్టుకు చేరిన వివాదాలు

ప్రభుత్వ రోజువారీ కార్యకలాపాలలో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారంటూ మద్రాస్ హైకోర్టు తలుపు తట్టింది కాంగ్రెస్ సర్కార్. దీనిపై విచారణ చేపట్టిన ఏకసభ్య ధర్మాసనం.. బేడీకి వ్యతిరేకంగా 2019 ఏప్రిల్ 30న తీర్పు ఇచ్చింది. రోజువారీ ప్రభుత్వ వ్యవహారాల్లో అధికంగా తలదూర్చకూడదని లెఫ్టినెంట్ గవర్నర్​కు సూచించింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాజ్యం దాఖలు చేయగా... పుదుచ్చేరి ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ సమన్వయంతో పనిచేసుకోవాలని పేర్కొంది ద్విసభ్య ధర్మాసనం. వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

బేడీని తొలగించాల్సిందే

అయితే, ఈ విబేధాలకు అడ్డుకట్ట పడలేదు. లెఫ్టినెంట్ గవర్నర్​ను తొలగించాల్సిందేనంటూ ముఖ్యమంత్రి నారాయణసామి డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇటీవలే రాష్ట్రపతిని కలిసి సవివర మెమొరాండం సమర్పించారు. కిరణ్ బేడీ.. రాష్ట్రంలో తుగ్లక్ దర్బార్ నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ఫ్రెంచ్​వారి పాలనలోనూ ఇలాంటి పరిస్థితి లేదంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన బేడీని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ ఆరోగ్యం, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 50 శాతం ప్రభుత్వ రిజర్వేషన్లు, ఉచిత రేషన్, మొబైల్ ట్యాబ్లెట్ల పంపిణీ వంటి పథకాల అమలును బేడీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలకు ఆంక్షలు విధిస్తున్నారని చెప్పారు. మద్యంపై కొవిడ్ ట్యాక్స్ వేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారని, ప్రజా పన్నులను తగ్గించాలన్న అభిప్రాయాన్ని తోసిపుచ్చారని అన్నారు.

ఇదీ చదవండి: ఎల్​జీ అధికారాల కేసులో సుప్రీం తాఖీదులు

అయితే, బేడీ మాత్రం ప్రభుత్వ ఆరోపణలను ఖండిస్తున్నారు. నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని చెబుతున్నారు. చట్టప్రకారమే విధులు నిర్వర్తించానని స్పష్టం చేశారు. ప్రజల కోసం పని చేశానని పేర్కొన్నారు.

మెజారిటీ కోల్పోయిన సర్కార్

మరోవైపు, బేడీ తొలగింపును ప్రజల విజయంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి బలహీనంగా మారుతోంది. నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో అసెంబ్లీలో అధికార, విపక్షాల బలం సమానంగా మారింది. త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉన్న ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో రాజీనామాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మెజారిటీ కోల్పోయిన ప్రభుత్వం దిగిపోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

నామినేటెడ్​ పదవులతో కలిపి పుదుచ్చేరి అసెంబ్లీలో 33 స్థానాలున్నాయి. కాంగ్రెస్, డీఎంకే కూటమికి ప్రస్తుతం 14 సీట్లు ఉండగా.. అన్నాడీఎంకే, ఆల్​ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, భాజపా(ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు) కూటమి బలం 14గా ఉంది. అధికార పార్టీ నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు ఒక ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది. దీంతో మొత్తం ఐదు స్థానాల్లో ఖాళీ ఏర్పడింది.

ఇదీ చదవండి: 14 రోజుల్లో సంచలన విషయాలు వెల్లడిస్తా: మల్లాడి కృష్ణారావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.