ETV Bharat / bharat

TTD Alert : భక్తులకు అలర్ట్.. తిరుమల వెళ్తున్నారా? ఈ విషయం తెలియకుంటే ఇబ్బంది పడతారు!

TTD Alert News : శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్తున్నారా..? మరి, ఈ విషయం మీకు తెలుసా? స్వామివారి ఆలయాన్ని మూసేస్తున్నారు! ఎప్పటి వరకు..? ఎందుకు..? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

TTD
TTD Alert
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 11:56 AM IST

TTD Latest News : తిరుమలలో వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునేందుకు నిత్యం వేలాది మంది తరలివస్తుంటారు. అయితే.. ఈ శనివారం (28వ తేదీ) తిరుమలకు వెళ్లే భక్తుల అలర్ట్‌గా ఉండాలి. ఎందుకంటే.. శనివారం రోజున తిరుమల తిరుపతిలోని అన్ని ఆలయాలను మూసివేయనున్నారు. మరి, ఎందుకు మూసివేస్తున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చంద్రగ్రహణం..
ఈ నెల 28వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుంది. అక్టోబర్‌ 28 (శనివారం) అర్ధరాత్రి దాటిన తర్వాత 29వ తేదీ ఆరంభ సమయంలో.. పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణం 01:05 గంటలకు ప్రారంభమై.. 02:24 గంటలకు ముగుస్తుంది. ఈ చంద్రగ్రహణం కారణంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని దేవాలయాలనూ మూసివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

గ్రహణం ఏర్పడిన ప్రతిసారీ గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా.. శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం సాయంత్రం 5 గంటలకు తలుపులు మూసివేస్తారు. తిరిగి శ్రీవారి ఆలయాన్ని ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు తలుపులు తెరుస్తారు.

టీటీడీ అనుబంధ ఆలయాలు కూడా..
తరవాత ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం.. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. తిరుమలలోని శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కోదండ రామస్వామి, శ్రీనివాస మంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో శనివారం రాత్రి 7 గంటలకు తలుపులు మూసివేస్తారు. తరవాత తెల్లవారుజామున 4.30 గంటలకు ఆలయాలను తెరిచి, శుద్ధి చేసిన అనంతరం భక్తులకు సర్వదర్శన అవకాశం కల్పిస్తారు. చంద్ర గ్రహణం కారణంగా.. శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో పౌర్ణమి అష్టోత్తర శతకలశాభిషేకం, శ్రీనివాస మంగాపురంలో పౌర్ణమి గరుడ సేవ రద్దయ్యాయి.

తెలియకపోతే ఇబ్బందులు..

చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారనే విషయం తెలియకుండా తిరుమల వెళ్తే.. కుటుంబ సభ్యులతో ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. అందుకే.. వివరాలన్నీ తెలుసుకొని, మీ రాకపోకల సమయాలను నిర్దారించుకుంటే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.

అత్యధికంగా భక్తులు సందర్శించిన ఆలయాల్లో తిరుమలకు రెండో స్థానం

చంద్రగ్రహణం అంటే ఏంటీ ? ఎలా ఏర్పడుతుంది ?
చంద్రుడు, సూర్యుడి మధ్యలోకి భూమి అడ్డుగా రావడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి మధ్యలో అడ్డుగా ఉంటుంది..దీంతో సూర్య కిరణాలు చంద్రుడిపై ప్రసరించవు. ఈ అద్భుతమైన చంద్రగ్రహణం దృశ్యం పౌర్ణమి రోజున మాత్రమే ఏర్పడుతుంది. ఈ శనివారం రోజున ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. చంద్రగ్రహణాన్ని చూడటానికి ఎలాంటి ప్రత్యేక పరికరాలూ అవసరం లేదు. నేరుగానే చూడవచ్చు. ఒకవేళ మీ దగ్గర టెలిస్కోప్‌ పరికరం ఉంటే.. చంద్రగ్రహణాన్ని మరింత స్పష్టంగా చూడవచ్చు.

TTD LATEST NEWS: తిరుమల నడకదారుల్లో ప్రతి భక్తుడి చేతికి కర్ర… కరుణా 'కర్ర' రెడ్డి చారిత్రాత్మక వింత నిర్ణయం

TTD Tirumala Seva Tickets for December : డిసెంబర్​లో తిరుమల వెళ్లే వారికి గుడ్​న్యూస్​.. శ్రీవారి సేవా టికెట్ల షెడ్యూల్ విడుదల.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.