TSRTC Bus Accident in Nellore District: నెల్లూరు జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు లారీని వెనకనుంచి ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు ప్రమాద స్థలంలోనే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ప్రాణాలు విడిచారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం టీఎస్ఆర్టీసీ మిర్యాలగూడ డిపోకు చెందిన బస్సు మిర్యాలగూడ నుంచి తిరుపతికి బయల్దేరింది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా గూడ్లూరు మండలం మోచర్ల వద్దకు చేరుకోగానే లారీని వెనకవైపు నుంచి వేగంగా ఢీకొట్టింది. బస్సు వేగం అధికంగా ఉండటంతో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.
బస్సును ఢీకొట్టిన డంపర్- 13మంది సజీవదహనం
ఏడుగురికి తీవ్రగాయాలు: ప్రమాద ధాటికి బస్సు డ్రైవర్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన బస్సు డ్రైవర్ వినోద్గా పోలీసులు గుర్తించారు. ప్రమాద స్థలం నుంచి క్షతగాత్రులను కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యకోసం క్షతగాత్రులను నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
TSRTC Bus Accident in AP: నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్న క్రమంలో సీతమ్మ (65) వృద్ధురాలి పరిస్థితి విషమంగా మారింది. తీవ్రగాయాలపాలైన సీతమ్మ నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్న సమయంలో కన్నుమూసింది. ప్రమాదంలో గాయపడిన మిగిలిన ఆరుగురికి నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు.
ఆటోను ఢీకొట్టిన పికప్ వ్యాన్- ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా 8మంది మృతి
సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని ఘటనపై వివరాలను ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలను సేకరించారు. నెల్లూరులో చికిత్స తీసుకుంటున్న వారి నుంచి మరింత సమాచారాన్ని సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రమాద సమయంలో బస్సులో 30మంది: బస్సు ప్రమాదానికి గురైన సమయంలో అందులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ఆర్టీసీకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు వెనకవైపు నుంచి అకస్మాత్తుగా వచ్చి ఢీ కొట్టిందని లారీ డ్రైవర్ వివరించాడు. తాను రహదారిపై మూడో లైన్లో లారీని నడుపుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఆయన తెలిపాడు. తెనాలి నుంచి ధాన్యాన్ని తరలిస్తున్న క్రమంలో మోచర్ల వద్దకు రాగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆయన వివరించాడు.