ETV Bharat / bharat

TSPSC Paper Leak Case : నిందితుడు డీఈ రమేశ్‌ కస్టడీ కోరుతూ సిట్‌ పిటిషన్‌

tspsc paper leak case
tspsc paper leak case
author img

By

Published : Jun 2, 2023, 1:09 PM IST

Updated : Jun 2, 2023, 3:37 PM IST

12:55 June 02

TSPSC Paper Leak Case : నిందితుడు డీఈ రమేశ్‌ కస్టడీ కోరుతూ సిట్‌ పిటిషన్‌

TSPSC Paper Leak Case Latest Update : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల కేసులో నిందితుడిగా ఉన్న డీఈ రమేశ్‌ను సిట్ అధికారులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజులు కస్టడీ ఇవ్వాలంటూ సిట్ అధికారులు నాంపల్లి కోర్టును కోరారు. దీనిపై నిందితుడి తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేసిన తర్వాత.. వాదనలు జరిగే అవకాశముంది. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో డీఈ రమేశ్‌ కీలకపాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన నిందితుడు భారీగా డబ్బు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

SIT Petition for Paper Leakage Accused Custody : ఓ ఇన్విజిలేటర్ సాయంతో ప్రశ్నలు తెలుసుకున్న డీఈ రమేశ్‌.. బ్లూటూత్ సాయంతో పరీక్ష కేంద్రంలో కూర్చున్న వాళ్లకు సమాధానాలు చేరవేసినట్లు సిట్ అధికారులు తేల్చారు. ఆ తర్వాత సురేశ్‌ అనే వ్యక్తి సాయంతో డీఏవో, ఏఈఈ ప్రశ్నాపత్రాలను లీక్ చేసి చాలా మందికి విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. రమేశ్‌తో చేతులు కలిపిన ఇన్విజిలేటర్‌తో పాటు అతని నుంచి ప్రశ్నాపత్రాలు ఎవరెవరు కొనుగోలు చేశారనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే రమేశ్‌ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మరికొంత సమాచారం వచ్చే అవకాశముందని సిట్ అధికారులు భావిస్తున్నారు.

అసలేెం జరిగిదంటే : హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌కు తెరలేపిన విద్యుత్‌ శాఖ డీఈ రమేశ్‌ అక్రమాలు బయటకి వచ్చాయి. డీఏవో, ఏఈఈ పరీక్షలకు హాజరైన 11 మంది అభ్యర్థులకు.. చెవిలో ఇమిడిపోయేలా బఠాణి గింజంత స్పీకర్‌ అమర్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందులో భాగంగానే పరీక్ష తర్వాత చెవిలో నుంచి బయటికి తీసేందుకు ఇయర్‌బడ్‌ రూపంలో ఉన్న మాగ్నెటిక్‌ పరికరాన్ని వినియోగించారు. ఈ క్రమంలోనే చిన్నపాటి చిప్‌తో కూడిన డివైజ్‌ను బనియన్‌లో కుట్టిన ప్రత్యేక అరలో బిగించారు.

ఇందులో భాగంగానే ఆ బనియన్‌ భుజం వద్ద ఓ మైక్రోఫోన్‌ అమర్చారు. పరీక్షలో హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌ ఎలా చేయాలో వారికి తర్ఫీదు ఇచ్చారు. ఈ క్రమంలోనే మలక్‌పేట టీవీ టవర్‌ ప్రాంతంలో.. ఖాలేద్‌ అనే వ్యక్తి ఇంట్లో ప్రత్యేకంగా ఓ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. సమాధానాలు చేర వేసేందుకు ప్రతి అభ్యర్థికి ప్రత్యేకంగా ఓ సహాయకుడిని రమేశ్‌ ముఠా అందుబాటులో ఉంచిందని సిట్‌ అధికారులు నిర్ధారించారు. మరోవైపు అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన తర్వాత ఎలా వ్యవహరించాలనే విషయంలో రమేశ్‌ ముఠా ప్రత్యేక సూచనలు చేసింది.

SIT Petition for Paper Accused DE Ramesh Custody : ఇందుకోసం అరగంట ముందే కేంద్రంలోకి వెళ్లి ఏ బెంచీలో కూర్చున్నామనే విషయాన్ని.. మైక్రోఫోన్‌ ద్వారా కంట్రోల్‌ రూంలోని సహాయకుడికి చేరవేసేలా ప్రణాళిక రూపొందించింది. మరోవైపు వాట్సప్‌ ద్వారా ప్రశ్నపత్రాన్ని లీక్‌ చేసేందుకు.. ఓ ఇన్విజిలేటర్‌ను మాట్లాడుకున్నట్లు సిట్ అధికారులు సమాచారం సేకరించారు. అతను ఎవరనేది గుర్తించారు. టోలిచౌకీ ప్రాంతంలో నివసించే అలీ అనే ప్రిన్సిపల్‌ ఈ నిర్వాకానికి పాల్పడినట్లు తేలింది. ఈ వ్యవహారంలో మరో 20 మంది వరకు ప్రమేయముందని నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలోనే నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నమైంది. ఈ హైటెక్‌ కాపీయింగ్‌కు సహకరించినందుకు.. ఒక్కో అభ్యర్థి నుంచి రమేశ్‌ ముఠా రూ.20 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు దండుకున్నట్లు సిట్‌ అధికారులు గుర్తించారు.

ఇవీ చదవండి : TSPSC Paper Leak Updates : వీళ్లు మామూలోళ్లు కాదు బాబోయ్.. మాస్‌ కాపీయింగ్‌ కోసం ఏకంగా..!

Accused used chat GPT to cheat in TSPSC Exams : టీఎస్​పీఎస్సీ పేపర్ లీక్.. చాట్​ జీపీటీతో ఏఈఈ పరీక్ష

Last Updated : Jun 2, 2023, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.