ETV Bharat / bharat

TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు.. సిట్‌ అధికారుల కీలక నిర్ణయాలు - టీఎస్​పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్ నోటీసులు

TSPSC Paper Leak Case Latest Updates: ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో.. టీఎస్​పీఎస్సీ సభ్యులను ప్రశ్నించేందుకు సిట్ సిద్ధమైంది. ఈ మేరకు కార్యదర్శిసహా ఒక సభ్యుడికి నోటీసులు జారీ చేశారు. ఛైర్మన్‌ జనార్ధన్‌రెడ్డికి కూడా తాఖీదులు ఇచ్చే అవకాశముంది. ఉద్యోగ నియామక పరీక్షల్లో సభ్యుల సలహాలు, సూచనలు ఎలా ఉంటాయి..? ప్రశ్నాపత్రాలు, భద్రపర్చేందుకు కమిషన్ తీసుకునే చర్యల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారనే వివరాలు తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే ఛైర్మన్, కార్యదర్శి నుంచి.. సిట్ అధికారులు వివరాలు సేకరించారు. మరోవైపు ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రధాననిందితుడిగా ఉన్న ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో 15ప్రశ్నాపత్రాలున్నట్లు దర్యాప్తులో తేలింది.

TSPSC paper leak case
TSPSC paper leak case
author img

By

Published : Mar 31, 2023, 7:51 PM IST

ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు.. TSPSC సభ్యుల విచారణ

TSPSC Paper Leak Case Latest Updates: ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో టీఎస్​పీఎస్సీ సభ్యులను ప్రశ్నించాలని సిట్‌ అధికారులు నిర్ణయించారు. సర్వీస్‌ కమిషన్‌లో సభ్యులపాత్ర, పరీక్షల నిర్వహణలో నిర్ణయాలు ఎలా ఉంటాయనే వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులోభాగంగా కమిషన్ సభ్యులను ప్రశ్నించాలని సిట్‌ భావించింది. ఈ క్రమంలోనే కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డికి నోటీసులు జారీ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ కార్యాలయానికి రావాలని అందులో పేర్కొన్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్.. కార్యదర్శి అనితా రామచంద్రన్​కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. 14వ నిందితుడిగా ఉన్న రమేశ్ బండి లింగారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. ప్రవీణ్, రమేశ్​​లను సిట్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. రాజశేఖర్‌రెడ్డి పొరుగు సేవల విధానంలో సిస్టమ్ అడ్మిన్​స్ట్రేటర్​గా పనిచేస్తున్నాడు. షమీమ్ అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా విధులు నిర్వహించారు.

విచారించే అవకాశం: ప్రవీణ్, రమేశ్​ వ్యక్తిగత సహాయకులుగా ఎప్పటి నుంచి పని చేస్తున్నారు.. వారు నిర్వర్తించే విధుల గురించి సిట్ అధికారులు కార్యదర్శితో పాటు.. సభ్యుడి నుంచి వాంగ్మూలం తీసుకోనున్నారు. హిమాయత్​నగర్​లోని సిట్ కార్యాలయంలో వీలైనంత తొందర హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే టీఎస్​పీఎస్సీకే చెందిన మరికొంత మందికి నోటీసులిచ్చి విచారించే అవకాశం ఉంది. సురేశ్‌ ఇదివరకు కమిషన్‌లో పనిచేసి.. మానేసి, వేరేచోట ఉద్యోగం చేస్తుడటంతో.. దీనిపై కమిషన్‌ సభ్యుల వాంగ్మూలం నమోదు చేయాలని నిర్ణయించారు.

పలు వివరాల సేకరణ: ఇప్పటికే సర్వీస్‌కమిషన్‌ ఛైర్మన్, కార్యదర్శి నుంచి సిట్‌ పలు వివరాలు సేకరించింది. వివిధ ఉద్యోగ నియామక పరీక్షలు ఎలా నిర్వహిస్తారు.. ప్రశ్నాపత్రాలు ఎవరు రూపొందిస్తారు.. వాటిని ఎక్కడ భద్రపరుస్తారు.. ఎవరెవరి ఆధీనంలో ప్రశ్నాపత్రాలు ఉంటాయనే వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు. టీఎస్​పీఎస్సీ పరిపాలన విభాగం సహాయ కార్యదర్శి సత్యనారాయణతో పాటు.. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మిని.. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సాక్ష్యులుగా చేర్చారు.

ప్రశ్నాపత్రాల లీకేజీలో టీఎస్​పీఎస్సీకి చెందిన నలుగురు ఉద్యోగులను సిట్ అరెస్ట్‌ చేసింది. కమిషన్‌కి చెందిన 20మంది గ్రూప్-1 ప్రిలిమ్స్ రాయగా 8 మంది మెయిన్స్‌కి అర్హత సాధించారు. షమీమ్, రమేశ్​, సురేశ్​కి 100కు పైగా మార్కులుచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో 15ప్రశ్నాపత్రాలున్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. గ్రూప్-1, ఏఈఈ, డివిజనల్ అకౌంట్స్​ అధికారి.. ఏఈ పరీక్షలతోపాటు టౌన్‌ప్లానింగ్, జేఎల్​ పరీక్షలకు చెందిన ప్రశ్నాపత్రాలున్నట్లు గుర్తించారు.

గతేడాది అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 జనరల్ స్టడీస్‌పేపర్‌ సహా.. ఈఏడాది జనవరి 22న జరిగిన ఏఈఈ ఉద్యోగానికి చెందిన పలుప్రశ్నాపత్రాలు పెన్‌డ్రైవ్‌లో ఉన్నట్లు తేల్చారు. ఏఈఈ పరీక్షకు సంబంధించి సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్ పరీక్షా పత్రాలున్నట్లు నిర్ధారించారు. డివిజినల్ అకౌంట్స్ అధికారి పరీక్షకు చెందిన.. జనరల్ స్టడీస్, మాథ్స్ ప్రశ్నపత్రాలను సిట్‌ అధికారులు గుర్తించారు.

ఇతరులెవరికైనా విక్రయించారా: ఏఈ పరీక్షకు సంబంధించి జనరల్ స్టడీస్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్ పేపర్-1.. సివిల్‌ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ పేపర్-2 ప్రశ్నాపత్రాలు పెన్‌డ్రైవ్‌లో లభించినట్లు తేల్చారు. టౌన్‌ప్లానింగ్ పరీక్షకు చెందిన.. ఒకేషనల్ ప్రశ్నాపత్రాలు బయటపడ్డాయి. జూలైలో జరగాల్సిన జూనియర్ లెక్చరర్ ప్రశ్నపత్రాల్ని పెన్‌డ్రైవ్‌లో గుర్తించారు. కస్టడీలో భాగంగా మూడోరోజు షమీమ్, రమేష్, సురేశ్‌ను సిట్‌ అధికారులు ప్రశ్నించారు. గ్రూప్-1 ప్రశ్నాపత్రాన్ని ఇతరులెవరికైనా విక్రయించారా అనే కోణంలో వివరాలు సేకరించారు.

ఇవీ చదవండి: TSPSC పేపర్ లీకేజీ కేసు.. ఆ ఏడుగురికి సిట్ నోటీసులు..!

TSPSC పేపర్ లీకేజీలో మరో ట్విస్ట్.. నిందితుల పెన్​డ్రైవ్​లో 15 ప్రశ్నపత్రాలు

మోదీ డిగ్రీ సర్టిఫికెట్ అడిగినందుకు.. కేజ్రీవాల్​కు రూ.25వేలు ఫైన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.