ETV Bharat / bharat

'కాంవడ్'​ యాత్రికులను ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురు దుర్మరణం

Kanwar Yatra: కాంవడ్​ యాత్ర.. వారి కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. యాత్రను ముగించుకొని ఇంటికి వెళ్తుండగా.. ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​ వద్ద భక్తులను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు.

Truck mows down Kanwar devotees in Uttar Pradesh's Hathras, 6 died

author img

By

Published : Jul 23, 2022, 9:53 AM IST

Kanwar Yatra: ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హరిద్వార్​లో కాంవడ్​ యాత్రకు వెళ్లి తిరిగి గ్వాలియర్​లోని తమ ఇళ్లకు వెళ్తుండగా.. ఓ ట్రక్కు ఢీకొట్టింది. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
భక్తులను ఢీకొట్టిన ట్రక్కు డ్రైవర్​.. పరారైనట్లు తెలుస్తోంది. నిందితుల కోసం గాలిస్తున్నామని.. త్వరలోనే పట్టుకొని శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.

శివుడి భక్తులు ఏటా కాంవడ్​ యాత్రకు వెళ్తుంటారు. ఈ భక్తులను కాంవడియాలుగా పిలుస్తారు. వీరు ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​, గౌముఖ్​, గంగోత్రి, బిహార్​లోని సుల్తాన్​గంజ్​ వంటి పవిత్ర ప్రాంతాల నుంచి గంగాజలం ఇంటికి తీసుకెళ్లి.. దేవుడ్ని పూజిస్తారు. కరోనా కారణంగా.. రెండేళ్లుగా కాంవడ్​ యాత్ర జరగలేదు. ఈసారి కొవిడ్​ నిబంధనల నడుమ పునఃప్రారంభమైంది.

ఇవీ చూడండి: ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. ఆత్మహత్యా? లేక...

రిటైర్మెంట్ ప్రకటించిన రాజకీయ దిగ్గజం.. ఇక కుమారుడి ఇన్నింగ్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.