మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. రాయ్‌గఢ్ జిల్లా పోలాద్పుర్ సమీపంలో 67 మందితో వెళ్తున్న లారీ 300 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు. మిగతా 64 మందికి గాయాలయ్యాయి. వీరిలో 33 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో 31 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. లారీలో ఉన్నవారంతా పెళ్లికి వెళ్లి వస్తున్నట్లు తెలిసింది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.