నందిగ్రామ్ ఫలితాల ప్రకటనను వాయిదా వేయాలంటూ ఈసీని కోరిన టీఎంసీ శ్రేణులు.. రీకౌంటింగ్‌కు పట్టుబట్టాయి. ఈవీఎం ట్యాంపరింగ్ సహా కౌంటింగ్‌లో అవకతవకలు ఉన్నాయని ఈసీకి లిఖితపూర్వకంగా అభ్యర్థన పత్రాన్ని అందించాయి.
అంతకుముందు మాట్లాడిన దీదీ.. నందిగ్రామ్ ఫలితం గురించి తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు విచారించాల్సిన అవసరం లేదన్నారు. నందిగ్రామ్‌లో గెలుపోటములను పట్టించుకోనని అన్నారు. ఫలితాల వెల్లడి అనంతరం కొన్ని అక్రమాలు జరిగినట్లు తన దృష్టికి వచ్చిందన్న దీదీ.. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.
చివరి రౌండ్ వరకు హోరాహారీగా సాగగా దీదీకి షాకిస్తూ భాజపా అభ్యర్థి సువేందు అధికారి 17వందల 36 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
నందిగ్రామ్ ప్రజలకు సువేందు కృతజ్ఞతలు..
నందిగ్రామ్‌లో గెలిచిన సువేందు అధికారి.. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజల ప్రేమ, నమ్మకం, ఆశీర్వాదం, మద్దతుతోనే నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినట్లు తెలిపారు. నందిగ్రామ్ ప్రజలకు సేవ చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమని ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: టీఎంసీకి షాక్- నందిగ్రామ్‌లో మమత ఓటమి