ETV Bharat / bharat

కరోనా విలయం.. ఆ రాష్ట్రాల్లో దయనీయ ఘటనలు

కరోనా మహమ్మారితో దేశంలో దయనీయమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సూరత్​లో 14 రోజుల పసిగుడ్డు వైరస్​కు బలికాగా.. బెంగళూరులో కొవిడ్ రోగుల పక్కనే కరోనా బాధితుడి మృతదేహాన్ని ఉంచారు. ఛత్తీస్​గఢ్​లో బెడ్లు ఖాళీగా లేక ఓ కరోనా బాధితుడికి కుర్చీలోనే ఆక్సిజన్ చికిత్స అందించారు.

treatment-to-corona-patients-near-dead-body-of-a-covid-deceased
కరోనా విలయం.. ఆ రాష్ట్రాల్లో దయనీయ ఘటనలు
author img

By

Published : Apr 15, 2021, 8:39 PM IST

దేశంలో కరోనా పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. వైరస్ వ్యాప్తి.. వైద్య వ్యవస్థలోని లోటుపాట్లను ఎత్తి చూపుతోంది. కరోనా చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల్లో పరిస్థితి మరింత దిగజారుతోంది.

ఛత్తీస్​గఢ్​లో పరిస్థితి దయనీయంగా మారింది. మహాసముంద్ జిల్లా ఆస్పత్రిలో ఓ కరోనా బాధితుడికి కుర్చీలో ఉంచి ఆక్సిజన్ అందించారు సిబ్బంది. పడకలు ఖాళీగా లేకపోవడం వల్ల.. మూడు గంటల పాటు ఆ వ్యక్తి కుర్చీలోనే ఆక్సిజన్ తీసుకుంటూ కనిపించాడు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. యువకుడికి బెడ్ సదుపాయం కల్పించి.. చికిత్స అందిస్తున్నారు. వార్డులో అదనంగా 30 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు.

covid
కుర్చీలో ఆక్సిజన్ తీసుకుంటున్న బాధితుడు

మరోవైపు, కరోనా మృతదేహాల తరలింపు కోసం రాయ్​పుర్ మున్సిపల్ కార్పొరేషన్.. రెండు ట్రక్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. బుధవారం 10 మృతదేహాలను రాయ్​పుర్​లోని భీమ్​రావ్ అంబేడ్కర్ ఆస్పత్రి నుంచి నవ రాయ్​పుర్​లోని శ్మశానవాటికకు తరలించారు.

covid
కరోనా మృతదేహాలను తరలించేందుకు ఏర్పాటు చేసిన డీసీఎం

ఛత్తీస్​గఢ్​లోని రాజ్‌నందగావ్‌ జిల్లాలో కరోనా మృతదేహాలను చెత్తబండ్లలో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

covid dead bodies in garbage van
రాజ్‌నందగావ్‌ జిల్లా డోంగార్​గావ్ ప్రాంతంలో చెత్త బండ్లలో మృతదేహాల తరలింపు

రోగుల పక్కనే మృతదేహం

బెంగళూరు రాజాజీ నగర్​లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని.. కొవిడ్ రోగి పక్కనే ఉంచారు. మృతదేహాలు పక్కనే ఉంటే బాధితుల మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతుందని రోగుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

covid
కరోనా బాధితుడి మృతదేహం
covid
మృతదేహం ఉన్న గదిలోనే బాధితులు

14 రోజుల పసికందు బలి

గుజరాత్​లో కరోనా విలయం కొనసాగుతోంది. కరోనా మరణాల సంఖ్యపై సర్కారు మౌనం వహిస్తున్న వేళ.. మరో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. సూరత్​లోని న్యూ సివిల్ ఆస్పత్రిలో 14 రోజుల పసిగుడ్డు కరోనాకు బలైన పరిస్థితి నెలకొంది. పుట్టిన మూడు రోజుల తర్వాత చిన్నారికి కరోనా సోకినట్లు డాక్టర్లు నిర్ధరించారు. శిశువుకు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయని గుర్తించారు. 11 రోజులుగా చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. దురదృష్టవశాత్తు శిశువు ప్రాణాలు విడిచినట్లు వైద్యులు చెప్పారు.

covid
14 రోజుల చిన్నారి మృతదేహం

ఇదీ చదవండి: ఆక్సిజన్​ తొలగించిన వార్డ్​ బాయ్​- కొవిడ్​ రోగి మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.