ETV Bharat / bharat

'ఆక్సిజన్​ను అత్యంత అరుదైనదిగా పరిగణించండి' - కేంద్ర ఆరోగ్య శాఖ

కరోనా 2.0 విజృంభణ వేళ.. దేశవ్యాప్తంగా మెడికల్​ ఆక్సిజన్​కు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్రాణవాయువును దుర్వినియోగం కాకుండా తగు చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. ఆక్సిజన్​ను అరుదైన వస్తువుగా పరిగణిస్తూ.. జాగ్రత్తగా వినియోగించాలని స్పష్టం చేసింది.

Lav Agarwal, Union Health ministry joint secretary
లవ్​ అగర్వాల్​, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి
author img

By

Published : Apr 30, 2021, 9:53 PM IST

దేశవ్యాప్తంగా ప్రాణవాయువు కొరత ఏర్పడిన వేళ.. కేంద్రం కీలక సూచనలు చేసింది. తమ దగ్గర అందుబాటులో ఉండే ఆక్సిజన్​ అత్యంత అరుదైన వస్తువుగా పరిగణించాలని ఆస్పత్రులకు సూచించింది. ప్రాణవాయువు దుర్వినియోగం కాకుండా.. వినియోగ పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట్రాలను కేంద్రం కోరినట్టు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​ తెలిపారు. మహమ్మారి ప్రారంభం నుంచే ఆక్సిజన్​ సహకారం అందించే పడకలను ప్రధాన ఆరోగ్య కేంద్రాలుగా ప్రభుత్వం గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గతేడాది ఏప్రిల్​-మే నెలల్లోనే ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా 1.02 లక్షల ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేసిందన్నారు.

"అందుబాటులో ఉన్న ఆక్సిజన్​ను అత్యంత అరుదైన వస్తువుగా పరిగణించాలి. అందుకోసం.. ప్రాణవాయువును అవసరమైనంత వరకు మాత్రమే ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రాలను అభ్యర్థించాం. ఆక్సిజన్​ సరఫరాను పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ద్రవ ఆక్సిజన్​ ధరను నిర్ణయించేందుకు నేషనల్​ ఫార్మాసూటికల్​ ప్రైసింగ్​ అథారిటీ(ఎన్​పీపీఏ) పలు సూచనలు జారీ చేసింది."

- లవ్​ అగర్వాల్​, కేంద్రం ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి

దేశవ్యాప్తంగా 154-మెట్రిక్​ సామర్థ్యం గల 162 ప్రెజర్​ స్వింగ్​ అడ్సార్పషన్​​(పీఎస్​ఏ) ప్లాంట్లను మంజూరు చేసినట్టు అగర్వాల్​ చెప్పారు. వీటిలో.. ఇప్పటికే 52 ప్లాంట్లను వ్యవస్థీకరించామన్న ఆయన.. మరో 87 ప్లాంట్లను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అంతేకాకుండా.. ఆయా రాష్ట్రాలకు 8,593 మెట్రిక్​ టన్నుల ఆక్సిజన్​ను కేటాయించామని ఆయన తెలిపారు.

ఆక్సిజన్​ సిలిండర్ల కొరతను తీర్చేందుకు.. ఈ నెల 21న.. 27వేల సిలిండర్​ల కొనుగోలుకు ఆర్డర్​ ఇచ్చినట్టు పేర్కొన్నారు అగర్వాల్​. మరో రెండురోజుల్లో అవి రానున్నాయన్నారు. వీటిలో 54వేల జంబో సిలిండర్లు(డీ-రకం), 73వేల రెగ్యులర్​ సిలిండర్లు(బీ-రకం) ఉన్నాయని ఆయన వివరించారు.

ఇదీ చదవండి: 'ఆ రాష్ట్రాల్లో ఐదు రెట్ల వేగంతో కొవిడ్​ 2.0 వ్యాప్తి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.