ETV Bharat / bharat

రామభక్తులే పాలించాలని 800కి.మీ సైకిల్​ యాత్ర! - West Bengal soil in Ramlala's court

బంగాల్​కు చెందిన ఓ వ్యక్తి 800 కిలోమీటర్లు సైకిల్​పై ప్రయాణించి అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి మట్టిని సమర్పించాడు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో హిందుత్వ భావజాలమున్న పార్టీ బంగాల్​లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రార్థించాడు.

రామ భక్తులే అధికారంలోకి రావాలని 800కి.మీ సైకిల్​ యాత్ర!
author img

By

Published : Dec 26, 2020, 2:31 PM IST

రాష్ట్రంలోని మట్టిని తీసుకుని 800 కిలోమీటర్లు సైకిల్​పై ప్రయాణించి.. ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి సమర్పించాడు బంగాల్​కు చెందిన సుబోధ్​ కుమార్​. రానున్న బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హిందుత్వ భావజాలాలున్న పార్టీ అధికారంలోకి రావాలని ప్రార్థించాడు​.

సోమవారం(డిసెంబర్​ 21) అయోధ్య చేరుకున్న సుబోధ్​.. సరయూ నదిలో స్నానం చేసి.. హనుమాన్ ఆలయంలో పూజలు చేశాడు. అనంతరం రామ మందిరానికి బంగాల్​ మట్టిని సమర్పించి.. రామ భక్తులే 2021 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో రావాలని ప్రార్థించాడు.

'కరోనాను రాముడే అంతం చేస్తాడు'

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనాను అంతం చేయాలని ప్రార్థించిన సుబోధ్​.. "కరోనా వల్ల ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాలు ఆర్థిక, ఆరోగ్య సంక్షోభంలో కూరుకుపోయాయి. అయితే శ్రీ రాముడు మాత్రమే మహమ్మారిని అంతం చేస్తాడు" అని అన్నాడు.

ఇదీ చూడండి: కమల్​కు షాక్​- భాజపాలోకి ఎంఎన్ఎం ప్రధాన కార్యదర్శి

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.