AC Mandatory In Trucks : రోడ్డు భద్రతకు సంబంధించి కేంద్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. N2, N3 కేటగిరీలకు చెందిన ట్రక్కుల క్యాబిన్‌లలో ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్(ఏసీ)లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. త్వరలోనే ట్రక్కు క్యాబిన్లలో ఏసీ తప్పనిసరి అవుతుందని తెలిపారు. N2 కేటగిరీ కింద ఉండే సరకు రవాణా వాహనాల బరువు 3.5 టన్నుల నుంచి 12 టన్నుల మధ్యలో ఉంటుంది. N3 కేటగిరీలో సరకు రవాణా వాహనాల బరువు 12 టన్నులకు పైగా ఉంటుంది.
'రోడ్డు భద్రతలో ట్రక్కు డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తారు. వారికి సౌకర్యవంతమైన పరిస్థితులు కల్పించడానికి ఈ నిర్ణయం ముఖ్యమైన మైలురాయి. ఇది డ్రైవర్ల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. డ్రైవర్ అలసట సమస్యను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది' అని ట్వీట్ చేశారు. ట్రక్కుల్లో ఎయిర్ కండిషన్ నిబంధనను తీసుకురానున్న విషయాన్ని గత నెల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ ప్రస్తావించారు. 2025 నాటికి అన్ని ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్లు తీసుకురావాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
-
Approved the draft notification to mandate the installation of air-conditioning systems in the cabins of trucks belonging to categories N2 and N3.
— Nitin Gadkari (@nitin_gadkari) July 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Truck drivers play a crucial role in ensuring road safety. This decision marks a significant milestone in providing comfortable…
">Approved the draft notification to mandate the installation of air-conditioning systems in the cabins of trucks belonging to categories N2 and N3.
— Nitin Gadkari (@nitin_gadkari) July 6, 2023
Truck drivers play a crucial role in ensuring road safety. This decision marks a significant milestone in providing comfortable…Approved the draft notification to mandate the installation of air-conditioning systems in the cabins of trucks belonging to categories N2 and N3.
— Nitin Gadkari (@nitin_gadkari) July 6, 2023
Truck drivers play a crucial role in ensuring road safety. This decision marks a significant milestone in providing comfortable…
అయితే, ఆయన రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ నిబంధనను తీసుకురాలని పలుమార్లు ప్రయత్నించారు. కానీ ఖర్చులు పెరిగుతాయనే ప్రశ్నలు లేవనెత్తిన దృష్ట్యా అది సాకారం కాలేదు. అయితే, నితిన్ గడ్కరీ ఈ నిబంధనకు సంబంధించిన డ్రాఫ్ట్ ఫైల్‌పై సంతకం చేశానని చెప్పారు. ట్రక్కులు డ్రైవర్లు దీన్ని స్వాగతిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
డ్రైవర్ క్యాబిన్లలో ఏసీలు ఏర్పాటు చేయడం వల్ల వాణిజ్య వాహనాల ధరలు 1 నుంచి 2 శాతం పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి. డ్రైవర్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందని.. దాంతో పాటు ఖర్చు కూడా పెరుగుతుందని వాహన తయారీ పరిశ్రమ సంబంధించిన ప్రతినిధులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
రహదారి ఇరువైపులా బాహుబలి ఫెన్సింగ్..
Nitin Gadkari Highway Fence : జాతీయ రహదారుల్లో ప్రమాదాలకు కారణమవుతున్న పశువులను అడ్డుకోవడానికి రోడ్లకు ఇరువైపులా వెదురుతో బాహుబలి ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. పశువుల కారణంగా జాతీయ రహదారుల్లో తీవ్ర ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, వాటిని అరికట్టడానికి ఈ ఏర్పాటు చేయబోతున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు.
Highway Bamboo Fence : 1.20 మీటర్ల ఎత్తున ఉండే ఈ కంచెను ప్రస్తుతం ఎన్‌హెచ్-30లోని సెక్షన్ 23లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ వెదురు కంచె పర్యావరణానికీ అనుకూలంగా ఉంటుందన్నారు. క్రియోసోట్ ఆయిల్ పూసిన వెదురు.. ఇనుముకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందన్నారు. దీనికి ఫైర్ రేటింగ్ క్లాస్-1 కూడా ఉంటుందని చెప్పారు. దీనివల్ల పశువులు, పెంపుడు జంతువుల వల్ల జరిగే ప్రమాదాలను కనీస స్థాయికి తీసుకురావడానికి వీలవుతుందని తెలిపారు.