Transgender Panchayat Secretary: తమిళనాడు తిరువళ్లూర్‌లో పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి.. ట్రాన్స్‌జెండర్ చందన్రాజ్ దాత్సాయని అరుదైన ఘనత సాధించారు. ఇలా జరగడం రాష్ట్రంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. బాధ్యతలు చేపట్టిన తొలి రోజే.. ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ అభిృవద్ధి శాఖలో ఓ ట్రాన్స్‌జెండర్ విధులు చేపట్టడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.
చందన్రాజ్ 2010లో పూవిరుథవల్లి అన్నంపేడు పంచాయతీ కార్యదర్శిగా నియమితుయ్యారు. అప్పుడు పురుషుడిగానే ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత ట్రాన్స్‌జెండర్‌గా మరారు. పారిపాలనా కారణాల దృష్ట్యా 2015లో కోసవంపాలయంకు బదిలీ అయ్యారు. అయితే ఆ తర్వాత విధులకు హాజరు కాలేదు. 2020లో మళ్లీ పంచాయతీ కార్యదర్శి పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మగ నుంచి ట్రాన్స్‌జెండర్‌గా మారుతున్నందువల్ల మానసిక ఇబ్బందులు తలెత్తి ఆఫీసుకు రాలేకపోయినట్లు దరఖాస్తులో పేర్కొన్నారు.
చందన్రాజ్ ఇప్పుడు పూర్తి ట్రాన్స్‌జెండర్‌గా మారారు. మళ్లీ విధులు నిర్వహించేందుకు సిద్ధం కావడం వల్ల జిల్లా కలెక్టర్ కూడా మానవతా దృక్పథంతో దరఖాస్తుకు అంగీకారం తెలిపారు. దీంతో ఎల్లాపురంలోని కొడువెలి పంచాయతీ సెక్రెటరీగా చందన్రాజ్ వాత్సాయనిని తిరిగి నియమించారు. శుక్రవారం విధుల్లో చేరిన అనంతరం చందన్రాజ్ మీడియాతో మాట్లాడారు. ట్రాన్స్జెండర్ల టాలెంట్‌ను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కూతురు శవాన్ని భుజంపై మోస్తూ 10కి.మీ నడిచిన తండ్రి