ETV Bharat / bharat

ఫేస్​బుక్ ద్వారా పరిచయం.. నాలుగేళ్లుగా ప్రేమ.. తీరా చూస్తే ట్రాన్స్​జెండర్!

ఫేస్​బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు.. రోజూ మాట్లాడుతూ ప్రేమలోకి దించాడు.. అబ్బాయిలా చెప్పుకొని మహిళను మభ్యపెట్టాడు.. నాలుగేళ్ల తర్వాత సీన్ కట్ చేస్తే.. షాక్! అసలేమైందంటే?

Transgender held for cheating woman by posing as man on Facebook

author img

By

Published : Jul 23, 2022, 10:47 PM IST

ఫేస్​బుక్​లో తనను తాను అబ్బాయిలా పరిచయం చేసుకొని ఓ మహిళకు టోకరా వేశాడు ట్రాన్స్​జెండర్. నిందితుడు సివిల్ ఇంజినీర్​గా చెప్పుకొంటూ మహిళను ప్రేమలోకి దించాడు. కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని విట్ల పట్టణంలో ఈ ఘటన జరిగింది. గత నాలుగేళ్లుగా నిందితుడు మహిళతో నిత్యం టచ్​లో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఫేస్​బుక్​లో సందేశాలు పంపించుకోవడం సహా ఫోన్లలో తరచుగా మాట్లాడుకునేవారని చెప్పారు. అయితే, ప్రేమ విషయం ఇంట్లోవారికి తెలియగానే నిందితుడి బాగోతం బట్టబయలైంది.

మహిళ కుటుంబ సభ్యులు నిందితుడి ఫేస్​బుక్​ వివరాలు సేకరించి.. తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన అడ్వొకేట్​ శైలజా రాజేశ్​కు ఇచ్చారు. వివరాల ప్రకారం నిందితుడి ఆచూకీ తెలుసుకున్న శైలజా రాజేశ్.. పోలీసులకు సమాచారం అందించారు. ఉడుపి జిల్లాలోని ఓ ప్రాంతంలో నిందితుడిని పట్టుకున్నారు. అప్పుడే ఆ వ్యక్తి స్వలింగ సంపర్కుడని పోలీసులకు తెలిసింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మహిళను మోసం చేసినందుకు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.