Transgender Mysore: కర్ణాటక మైసూర్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ అక్రమ్ పాషా అలియాస్ షబానా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. భిక్షాటన చేసి తన మనవరాలిని కిక్‌బాక్సింగ్ ప్లేయర్‌గా మార్చింది. ఈ క్రమంలో ఎన్నో కష్టాలను తట్టుకుంది. బాధలను ఓర్చుకుంది. సమస్యలను ఎదుర్కొంది. అదే ఆమె స్థాయిని పెంచింది.
షబానా మనవరాలు ఫాతిమా(15) ఇప్పుడు WAKO ఇండియా కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది.
Mysore Girl Won Gold Medal in Kickboxing: ట్రాన్స్‌జెండర్ షబానా ప్రస్తుతం భిక్షాటన చేస్తూనే జీవనం సాగిస్తోంది. తన వృత్తిని కొనసాగిస్తూనే.. ఫాతిమాను చదివించడం సహా మైసూర్ డిస్ట్రిక్ట్ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్‌లో బాక్సింగ్ శిక్షణ ఇప్పిస్తోంది.
9వ తరగతి చదువుతున్న ఫాతిమా గతేడాది డిసెంబర్ చివరివారంలో పుణెలో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంది. అండర్-15 విభాగంలో వాకో ఇండియా కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ నెగ్గింది.
Shabana needs helping hands:
ఫాతిమాను అంతర్జాతీయ స్థాయి కిక్‌బాక్సింగ్ ప్లేయర్‌గా చూడాలనుకుంటోంది షబానా. ఆమె ట్రైనింగ్ సహా చదువు, ఇతర ఖర్చులు ఈ ట్రాన్స్‌జెండర్‌కు తలకు మించిన భారంగా మారింది. అందుకే దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తోంది.
ఇవీ చూడండి: దేశీయ కృత్రిమ గుండె- ధర చాలా తక్కువండోయ్!
ఇంట్లో నుంచి గెంటేసిన బిడ్డలపై 76 ఏళ్ల తల్లి పోరాటం.. చివరకు..