ETV Bharat / bharat

ఎంబీబీఎస్​ చదివి యాచకవృత్తిలో .. పోలీసుల సాయంతో క్లీనిక్​ - Madurai Government Medical College

సమాజంలో తనకు ఎలాంటి గుర్తింపు లేదని.. ఎంబీబీఎస్​ చదువుకున్న ఓ ట్రాన్స్​జెండర్ తమిళనాడు వీధుల్లో యాచకవృత్తిలోకి దిగింది. అయితే ఆమెను గుర్తించిన పోలీసులు.. క్లీనిక్​ తెరవడానికి సాయం చేశారు.

Transgender doctor found begging in streets, as people fail to recognise
యాచికవృత్తిలో యువవైద్యురాలు- పోలీసుల సాయంతో క్లీనిక్​
author img

By

Published : Nov 24, 2020, 5:35 PM IST

ఎంబీబీఎస్ చదువుకుని యాచకవృత్తిని ఎంచుకున్నది తమిళనాడు మధురైకి చెందిన ఓ హిజ్రా. అయితే పురుషుడిగా ఉన్నంత వరకు సాఫీగా సాగిన ఆమె జీవితం.. లింగమార్పిడి చేయించుకున్నాక తలకిందులైంది. గుర్తింపు కరువైంది. దీంతో బతుకుదెరువు కోసం మిగిలిన ట్రాన్స్​జెండర్స్​తో కలిసి యాచక వృత్తిలోకి దిగింది. ఇది గుర్తించిన ఆ ప్రాంత పోలీసు అధికారిణి... ఆ హిజ్రాతో క్లీనిక్​ ఏర్పాటు చేయడానికి సాయం చేశారు.

ఏం జరిగింది?

మధురైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్​ పూర్తి చేశాడు ఓ వ్యక్తి​. అనంతరం ఓ ఆసుపత్రిలో ఏడాది పాటు వైద్యుడిగా సేవలందించాడు. కొన్నాళ్ల తర్వాత మహిళగా మారాలని అనుకున్నాడు. అయితే దీనికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అయినా.. లింగమార్పిడి చేసుకున్నాడు. అప్పటి నుంచి అతడు కాస్త.. 'ఆమె'గా మారింది.

Transgender doctor found begging in streets, as people fail to recognise
ట్రాన్స్​జెండర్​ను ఆరా తీస్తున్నపోలీసు అధికారి

ఈ క్రమంలో ఆసుపత్రిలో ఆమె ఉద్యోగం కూడా పోయింది. దీంతో అయినవాళ్లు ఆదరించక.. ఇటు ఉద్యోగం లేక అవస్థలు పడింది. దిక్కులేని పరిస్థితిల్లో బతకడానికి ఇతర ట్రాన్స్​జెండర్స్​తో కలిసి యాచించడం మొదలుపెట్టింది.

పోలీసుల చొరవతో..

ఆ ప్రాంతంలో ఇన్​స్పెక్టర్​గా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారి కవిత... ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆ వ్యక్తి కోసం ఆరా తీసి, మిగిలిన విషయాలు తెలుసుకున్నారు. అన్ని విషయాలు నిర్ధరించుకున్న తర్వాత ఓ క్లీనిక్​ ఏర్పాటు చేయడానికి సాయం చేశారు. భారతీయ వైద్య మండలి గుర్తింపు పొందితే... త్వరలోనే తిరిగి వైద్య సాధన ప్రారంభించనుంది ఆ ట్రాన్స్​జెండర్​.

Transgender doctor found begging in streets, as people fail to recognise వైద్యురాలితో కవిత

గొప్ప మనుసుతో హిజ్రాకు సాయం చేసిన కవితపై అధికారులతో పాటు నెటిజన్లూ ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.

ఇదీ చూడండి: దేశంలో తొలి ట్రాన్స్​జెండర్​ నర్స్​గా అన్బూ రూబీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.